News February 1, 2026

దేవరకద్ర: మున్సిపల్ ఎన్నికల్లో BJP ఎంపీ వర్సెస్ MLA

image

దేవరకద్ర మున్సిపాలిటీలో జరగనున్న ఎన్నికల్లో రైల్వే అండర్‌పాస్ బ్రిడ్జి అంశం ప్రధాన రాజకీయ చర్చగా మారింది. ఈ బ్రిడ్జి మంజూరు కావడంలో ఎంపీ డీకే అరుణ కీలక పాత్ర పోషించారని బీజేపీ శ్రేణులు పేర్కొంటుండగా, అదే సమయంలో ఈ ప్రాజెక్ట్ సాధ్యమయ్యేందుకు ఎమ్మెల్యే జీఎంఆర్ కృషే ప్రధానమని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నాయి. ఇరువురి మధ్య SMలో ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి.

Similar News

News February 1, 2026

MBNR: ఆపరేషన్ స్మైల్–XII.. 83 మంది విముక్తి

image

బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ స్మైల్–XII కార్యక్రమంలో భాగంగా.. గత నెలలో జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక బృందాల ఆధ్వర్యంలో విస్తృత దాడులు నిర్వహించినట్లు మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ డి.జానకి తెలిపారు. మొత్తం 83 మంది బాలకార్మికులను గుర్తించి వారికి విముక్తి కల్పించాం, వీరిలో 7 మంది బాలికలు,76 మంది బాలురు ఉన్నారని వెల్లడించారు.

News February 1, 2026

ముస్తాబైన మన్యంకొండ.. ఈ రోజే తేరు

image

మహబూబ్‌నగర్ జిల్లాలో కొలువై తెలంగాణ తిరుపతిగా పేరొందిన మన్యంకొండ జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ రోజు తేరు కావడంతో చుట్టూ ప్రక్క గ్రామాల భక్తులు ఇతర జిల్లాల నుంచి చాలా మంది మన్యంకొండకు తరలివస్తున్నారు. కొండ పైన స్నానానికి కోనేరు, ఉచిత దర్శనం, భోజనం, మరుగుదొడ్లు, పోలీస్ ఆరోగ్య సిబ్బంది,108 వాహనాల సౌకర్యం కూడా కల్పించారు. మరి మీరు కూడా వస్తున్నారా కామెంట్ చేయండి.

News February 1, 2026

పాలమూరు కాంగ్రెస్‌లో వర్గ పోరు

image

పాలమూరు మున్సిపాలిటీ ఎన్నికల వేళ అధికార పార్టీలో వర్గ రాజకీయాలు భగ్గుమంటున్నాయి. కరవమంటే కప్పకు కోపం, వదలమంటే పాముకు ద్వేషం అనే విధంగా కాంగ్రెస్ రాజకీయాలు నడుస్తున్నాయి. 60 డివిజన్లకు కాంగ్రెస్ ఆశావహులు 328 మంది నామినేషన్లు వేశారు. ఈ క్రమంలో పార్టీ నేతలు టికెట్లు ఆశిస్తున్న ఆశావహుల మధ్య ఏకాభిప్రాయం కుదిర్చే ప్రయత్నం చేసిన లాభం లేకుండా పోయిందని తెలిసింది.