News January 4, 2025
దేవరకద్ర: సాగుచేసిన రైతులకు రైతుభరోసా: జూపల్లి
పంటలు సాగు చేసిన రైతులకు రైతుభరోసా అందిస్తామని, రేపు జరిగే కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. దేవరకద్రలో మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. గత BRS ప్రభుత్వ 10 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే రైతులకు రూ.21 వేల కోట్లు రుణమాఫీ చేసిందన్నారు.
Similar News
News January 6, 2025
మహబూబ్‌నగర్ జిల్లాలో నేటి వార్తలు ఇవే.. డోంట్ మిస్
❤️హెల్మెట్ లేకుంటే కలెక్టరేట్లోకి నో ఎంట్రీ: వనపర్తి కలెక్టర్ బాదావత్ సంతోష్.❤️జీవితంలో సైన్స్ చాలా అవసరం:నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్.❤️కాలేజీ బాత్రూమ్లో కెమెరా కలకలం: పోలీసుల అదుపులో ఓ యువకుడు.❤️బొట్టు పెట్టి చెప్తున్నాం.. పేరెంట్స్ మీటింగ్‌కు రండి సింగోటంలో గ్రామస్తులను ఆహ్వానించిన టీచర్లు.❤️ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానం: ఎస్పీ గిరిధర్
News January 6, 2025
నాగర్‌కర్నూల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి
నాగర్‌కర్నూల్ జిల్లా చారకొండ మండల పరిధిలోని జడ్చర్ల, కోదాడ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ట్యాంకర్‌ను కారు ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. మృతులు గణేశ్(30), రామకోటి(25)లుగా స్థానికులు గుర్తించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News January 5, 2025
MBNR: చేతులకు సంకెళ్లతో ఉద్యోగుల నిరసన
ఉద్యోగ భద్రత, సమస్యల పరిష్కారం కోరుతూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆయ జిల్లా కేంద్రాల్లో సమగ్ర శిక్షా ఉద్యోగులు నిరవధిక సమ్మె చేస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఆదివారం ఉద్యోగులు వినూత్న రీతిలో తమ నిరసన తెలిపారు. వారు తమ చేతులకు సంకెళ్లు వేసుకుని, ప్లకార్డులు పట్టుకొని ‘సంకెళ్లు తెంపండి.. రెగ్యులర్ చేయండి’ అనే నినాదంతో శిబిరంలో నినాదాలు హోరెత్తించారు. అధిక సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు.