News February 25, 2026

దేవరకొండ: ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన డీసీహెచ్‌ఎస్

image

జిల్లా ఆసుపత్రి సేవల సమన్వయకర్త డా.మాతృనాయక్ బుధవారం దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్డులను సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. రికార్డులు, ల్యాబ్ పరీక్షలను పరిశీలించి, ఆసుపత్రి ఆవరణలో పారిశుద్ధ్యంపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. సూపరింటెండెంట్ డా. రవిప్రకాశ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Similar News

News February 27, 2026

NLG: ఇంటర్ పరీక్షలు.. మూడోరోజు 339 మంది గైర్హాజరు

image

జిల్లాలో శుక్రవారం జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 339 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డిఐఈఓ దస్రూనాయక్ వెల్లడించారు. జనరల్ విభాగంలో మొత్తం 11,751 మంది విద్యార్థులకు గాను 11,535 మంది హాజరుకాగా, 216 మంది గైర్హాజరయ్యారు. వొకేషనల్ విభాగంలో 1,566 మంది విద్యార్థులకు గాను 1,443 మంది హాజరుకాగా, 123 మంది గైర్హాజరయ్యారు.

News February 27, 2026

అమర పోలీసుల కుటుంబాలకు ఎస్పీ భరోసా

image

విధి నిర్వహణలో రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయిన పోలీస్ సిబ్బంది షేక్ తాయూబ్, మరియదాస్‌ల కుటుంబాలకు ఎస్పీ చేయూతనిచ్చారు. మృతుల కుటుంబ సభ్యులు సభానా, లక్ష్మిలకు ప్రభుత్వం మంజూరు చేసిన ఆర్థిక సహాయం చెక్కులను అందజేశారు. వారి త్యాగం శాఖకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని, విధి పట్ల వారు చూపిన నిబద్ధత వెలకట్టలేనిదని ఎస్పీ కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.

News February 27, 2026

పుణ్యక్షేత్రాల దర్శనానికి ‘భారత్ గౌరవ్’ రైళ్లు

image

పుణ్యక్షేత్రాల దర్శనానికి ఐఆర్‌సీటీసీ ‘భారత్ గౌరవ్’ పర్యాటక రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. మార్చి 21 నుంచి జూన్ 12 వరకు తెలుగు రాష్ట్రాల నుంచి 6 ప్రత్యేక ప్యాకేజీలు నిర్వహించనున్నట్లు ఐఆర్‌సీటీసీ మేనేజర్ పి.వి. వెంకటేష్ తెలిపారు. రామేశ్వరం, కన్యాకుమారి యాత్రకు ₹14,700, ఉజ్జయిని, సోమనాథ్ యాత్రకు ₹17,600 టికెట్ ధరలు నిర్ణయించారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.