News December 30, 2024
దేవరపల్లి: లారీని ఢీకొన్న ట్రావెల్స్ బస్సు.. తప్పిన పెను ప్రమాదం
దేవరపల్లి మండలంలోని డైమండ్ జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. వైజాగ్ నుంచి గుంటూరు వెళుతున్న ప్రైవేటు ట్రావెల్ బస్సు లారీను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. హైవే అంబులెన్స్‌లో క్షతగ్రాతులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 48 మంది ప్రయాణికులు ఉన్నట్లు చెబుతున్నారు.
Similar News
News January 2, 2025
ఏలూరు: కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలకు 346 మందికి 211 మంది ఎంపిక
ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం పెరేడ్ గ్రౌండ్‌లో మూడోరోజు కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలను జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ గురువారం ప్రారంభించారు. 346 మంది అభ్యర్థులు హాజరు కాగా 211 మంది క్వాలిఫై అయినట్లు తెలిపారు. 3, 4వ తేదీలలో మహిళా కానిస్టేబుల్స్‌కు మహిళ అధికారులతో ప్రత్యేక పోటీ పరీక్షలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. సెల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, వాచీలకు అనుమతి లేదన్నారు.
News January 2, 2025
జీలుగుమిల్లి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం దర్భగూడెం సమీపంలో జాతీయ రహదారిపై గురువారం సైకిల్‌ను లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో దర్భగూడెం గ్రామానికి చెందిన పైడి మర్ల సోమిరెడ్డి(70) అక్కడికక్కడే మృతి చెందాడు. రోడ్డు దాటే క్రమంలో లారీ అతివేగంగా రావటంతో ఈ ఘటనా జరిగింది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News January 2, 2025
గోవాలో ప.గో.జిల్లా యువకుడి మృతి
గోవాలో తాడేపల్లిగూడేనికి చెందిన రవితేజ అనే యువకుడు మృతి చెందాడు. అందిన సమాచారం మేరకు.. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా కాలంగూట్ బీచ్ కు వెళ్లారు. ఓ రెస్టారెంట్లో రవితేజ అతని మిత్రుడు సందీప్ ఫుడ్ ఆర్డర్ ఇచ్చారు. అయితే వారి వద్ద నుంచి అధిక ధర డిమాండ్ చేయడంతో కుదరదని చెప్పారు. దీంతో రెస్టారెంట్ యాజమాన్యం రవితేజపై దాడికి పాల్పడింది. దెబ్బలు తాళలేక రవితేజ మృతి చెందినట్లు సమాచారం.