News January 15, 2026

దేవరాపల్లి: పిండివంటలు చేస్తుండగా ప్రమాదం

image

దేవరాపల్లి మండలం ఎం.అలమండ గ్రామంలో గురువారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సిరవరపు స్వప్న గ్యాస్ పొయ్యిపై పిండివంటలు చేస్తుండగా అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో ఇంట్లో ఉన్న ఫర్నిచర్‌తో పాటు ఇతర గృహోపకరణాలు పూర్తిగా కాలిపోయాయి. ఈ ఘటనలో సుమారు రూ.3.50 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News February 13, 2026

BREAKING: మోత్కూరు మున్సిపల్ పీఠం కాంగ్రెస్‌దే

image

యాదాద్రి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ పీఠం కాంగ్రెస్ గెలిచింది. ఇక్కడ 12 వార్డులకు గాను 8 వార్డులు కాంగ్రెస్ సాధించింది. 3 వార్డులు BRS, 1 ఇండిపెండెంట్ గెలిచారు. మ్యాజిక్ ఫిగర్ దాటడంతో కాంగ్రెస్ పీఠం దక్కించుకుంది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.

News February 13, 2026

PMO ఇకపై సేవా తీర్థ్.. ప్రారంభించిన మోదీ

image

ఢిల్లీలో కొత్తగా నిర్మించిన సేవా తీర్థ్ కాంప్లెక్స్‌ను PM మోదీ ప్రారంభించారు. దీంట్లో PMOతో పాటు నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్, క్యాబినెట్ సెక్రటేరియట్‌కు సంబంధించిన ఆఫీసులుంటాయి. ఇక నుంచి PMOను సేవా తీర్థ్‌గా పిలుస్తారు. సెంట్రల్ సెక్రటేరియట్‌కు కర్తవ్య భవన్‌గా నామకరణం చేశారు. గతంలో ఇవన్నీ సెంట్రల్ విస్టా పరిధిలో వివిధ ప్రాంతాల్లో ఉండేవి. దీనివల్ల పరిపాలనాపరమైన ఆలస్యం చోటు చేసుకునేది.

News February 13, 2026

కీలకం కానున్న MLA, MLC, MPల ఓట్లు

image

TG: మున్సి‘పోల్స్’ ఫలితాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటాపోటీగా ఉన్న చోట్ల ఛైర్మన్, మేయర్ ఎంపికలో ఎక్స్‌అఫీషియో సభ్యులుగా MLA, MLC, MPల ఓట్లు కీలకం కానున్నాయి. రాజ్యసభ సభ్యులు, MLCలు రాష్ట్రంలో ఎక్కడైనా తమ ఓటు వినియోగించుకొనేందుకు ఆప్షన్ ఇచ్చుకోవచ్చు. అదే లోక్‌సభ సభ్యులు, MLAలు తమ నియోజకవర్గ పరిధిలోని ఏదో ఒక మున్సిపాల్టీలో మాత్రమే ఓటేయాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.