News September 14, 2025

దేవాలయాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేసిన నూతన ఎస్పీ

image

ఎస్పీ సతీష్ కుమార్ ఆదివారం పుట్టపర్తి నూతన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం దుర్గా ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి పట్టణంలోని చర్చి, మసీదులకు వెళ్లి ఆయా మత సంప్రదాయాలను గౌరవిస్తూ మత పెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆయన వెంట పలువురు సిబ్బంది ఉన్నారు.

Similar News

News September 14, 2025

లోక్‌సభ ర్యాంకిగ్స్‌లో హిందూపురం MPకి 20వ ర్యాంక్

image

లోక్‌సభలో MPల పెర్ఫామెన్స్‌ రిపోర్ట్‌ను పార్లమెంట్ ఆదివారం విడుదల చేసింది. 2024 జూన్ 24 నుంచి 2025 ఏప్రిల్ 4వ తేదీ వరకు MPలు పాల్గొన్న డిబెట్‌లు, అడిగిన క్వశ్చన్స్, అటెండెన్స్ ఆధారంగా ఈ ర్యాంక్‌లు ఇచ్చింది. ఈ నివేదిక ప్రకారం హిందూపురం MP పార్థసారథి 20వ స్థానంలో నిలిచారు. ఆయన లోక్‌సభలో మొత్తం 72 ప్రశ్నలు అడిగారు. 1 చర్చలో పాల్గొన్నారు. కాగా ఆయన హాజరు 69.12శాతం గా ఉంది. ఈయన పనితీరుపై మీ కామెంట్..!

News September 14, 2025

అదాలత్‌లో 10,321 కేసులు పరిష్కారం: వరంగల్ సీపీ

image

జాతీయ లోక్ అదాలత్‌కు విశేష స్పందన లభించిందని, వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 10,321 కేసులు పరిష్కారమయ్యాయని సీపీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. ఇందులో ఎఫ్‌ఐఆర్ కేసులు, డ్రంకన్&డ్రైవ్, మోటార్ వాహన చట్టం, సైబర్ కేసులు వంటివి ఉన్నాయని ఆయన వివరించారు. ఈ అదాలత్ విజయవంతం కావడంలో కృషి చేసిన సిబ్బందిని ఆయన అభినందించారు.

News September 14, 2025

హైదరాబాద్‌లో మొదలైన వర్షం

image

TG: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం మొదలైంది. ఉప్పల్, రామంతాపూర్, బోడుప్పల్, మేడిపల్లి, అల్వాల్, సుచిత్ర, కొంపల్లి, కంటోన్మెంట్, హయత్ నగర్ తదితర ప్రాంతాల్లో వాన పడుతోంది. కాసేపట్లో నగరంలోని ఇతర ఏరియాలకూ విస్తరించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. మరి మీ ప్రాంతంలో వర్షం పడుతోందా? కామెంట్ చేయండి.