News December 20, 2025

దేవుడిని కోర్కెలు కోరుతున్నారా?

image

దేవుడు సర్వవ్యాపి. సర్వజ్ఞుడు. ఆయన మన ప్రార్థన కంటే దాని వెనకున్న ఉద్దేశాన్ని గమనిస్తాడు. మనమేం కోరకున్నామన్న దానికంటే రోజూ ఏ పనులు చేస్తున్నాం అన్నదే చూస్తాడు. సామాన్యుడి ప్రతి కర్మలను చూస్తూ మనలోని మంచి చెడులను ఎప్పుడూ లెక్కిస్తూ ఉంటాడు. అందుకే ఆయనకు కోర్కెలు కోరకుండా, నిష్కల్మషమైన మనసుతో సత్కర్మలు చేయాలి. మన కర్మలు బాగున్నప్పుడు, భగవంతుడు మనకు అవసరమైన ఫలితాన్ని సరైన సమయంలో తప్పక ప్రసాదిస్తాడు.

Similar News

News December 27, 2025

న్యూఇయర్‌కి ఫ్యామిలీతో ఉంటారా.. జైల్లో ఉంటారా: సజ్జనార్

image

TG: జనవరి 1 వరకు స్పెషల్ డ్రంకెన్ డ్రైవ్ కొనసాగుతుందని హైదరాబాద్ CP సజ్జనార్ పేర్కొన్నారు. 2025 వార్షిక నేర నివేదిక విడుదల సందర్భంగా పౌరులను హెచ్చరించారు. ‘మద్యం తాగి పట్టుబడితే జైల్లో వేయటం ఖాయం. HYD మొత్తం ఇప్పటికే న్యూ ఇయర్ డ్రంకెన్ డ్రైవ్‌ నడుస్తోంది. ఈ ఏడాది నగరంలో నేరాలు 15% తగ్గాయి. పోక్సో కేసులు కూడా తగ్గుముఖం పట్టాయి. 368 కేసుల్లో రూ.6.45 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్ చేశాం’ అని తెలిపారు.

News December 27, 2025

జరీబు భూములపై పరిశీలనకు ఆదేశం

image

AP: రాజధాని ప్రాంతంలోని జరీబు(3 పంటలు పండేవి) భూములపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భూముల వర్గీకరణపై పున:పరిశీలనకు రాష్ట్రస్థాయి కమిటీ ఏర్పాటు చేసింది. జరీబు, నాన్ జరీబు భూములు ఇచ్చినవారికి ప్లాట్లు ఇస్తున్నామని, ఈ ప్రక్రియ 45రోజుల్లో పూర్తి చేయనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు.

News December 27, 2025

పోస్ట్ పార్టమ్ డిప్రెషన్‌కు దీంతో చెక్

image

కొందరు మహిళలు డెలివరీ తర్వాత డిప్రెషన్‌కు లోనవుతుంటారు. దీనివల్ల తల్లీబిడ్డలిద్దరికీ ప్రమాదమే అంటున్నారు నిపుణులు. అయితే డెలివరీ తర్వాత డిప్రెషన్ రాకుండా తక్కువ మోతాదులో ఎస్కెటమైన్‌ ఇంజెక్షన్‌ ఇస్తే ఫలితం ఉంటుందంటున్నారు. డిప్రెషన్‌కు వాడే కెటమైన్‌ అనే మందు నుంచే ఎస్కెటమైన్‌ను తయారు చేస్తారు. పరిశోధనల్లో ఇది సుమారు 75% వరకూ డిప్రెషన్ లక్షణాలు రాకుండా చూసినట్లు పరిశోధకులు వెల్లడించారు.