News December 21, 2025
దేవుడున్నాడు అనేందుకు ప్రూఫ్స్..

ప్రకృతిలో మన మేధస్సుకు అందని వింతలు భగవంతుని ఉనికికి నిదర్శనమవుతున్నాయి. యాగంటి, కాణిపాకం, కాశీ, బిక్కవోలు వంటి క్షేత్రాలలో విగ్రహాలు పెరగడం దైవలీలకు నిదర్శనం. ఈ అద్భుతాలు విగ్రహాల పరిమాణం పెరగడమే కాకుండా, మనలో భక్తిని, ధర్మాన్ని పెంచాలని సూచిస్తాయి. శాస్త్ర సాంకేతికతకు అందని ఈ రహస్యాలు దైవశక్తి అనంతమైనదని మనకు తెలియజేస్తున్నాయి. సృష్టిలోని ఈ వింతలు దేవుడు ఉన్నాడని నమ్మే భక్తులకు గొప్ప సంకేతాలు.
Similar News
News December 23, 2025
శరీరానికే వైకల్యం.. సంకల్పానికి కాదు: IESలో మానవేంద్ర వండర్!

శారీరక వైకల్యం అడ్డువచ్చినా, పట్టుదలతో భారతీయ ఇంజినీరింగ్ సర్వీసెస్ (IES) పరీక్షలో 112వ ర్యాంక్ సాధించారు మానవేంద్ర సింగ్. తండ్రి చనిపోయినా, తల్లి రేణు సింగ్ ఇచ్చిన ధైర్యంతో ఈ విజయం అందుకున్నారు UPలోని బులంద్‌షహర్‌కు చెందిన ఈ కుర్రాడు. పట్నాలో బీటెక్ చేస్తుండగానే IES ఆఫీసర్ కావాలని కలలు కన్నారు. ఇప్పుడు అది నిజం కావటంతో కుటుంబ సభ్యులు, ఊరి జనం మానవేంద్రను అభినందనలతో ముంచెత్తుతున్నారు.
News December 23, 2025
మెస్సీ సోదరికి యాక్సిడెంట్.. తీవ్ర గాయాలు

అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ మెస్సీ సోదరి మారియా సోల్ మియామిలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి గోడను ఢీకొట్టింది. దీంతో ఆమె శరీరంలో కొంతభాగం కాలిపోవడంతో పాటు వెన్నెముక, మడమ, మణికట్టు వద్ద ఫ్రాక్చర్ అయినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. జనవరి 3న జరగాల్సిన ఆమె పెళ్లి కూడా వాయిదా పడింది. మెస్సీ ఇటీవల భారత్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే.
News December 23, 2025
డిస్కౌంట్‍లో చేనేత వస్త్రాల అమ్మకాలు: సవిత

AP: ఈనెల 26నుంచి తిరుపతిలో చేనేత ఎగ్జిబిషన్ ప్రారంభమవుతుందని మంత్రి సవిత తెలిపారు. ’60, 50, 40 శాతాల్లో చేనేత వస్త్రాలపై డిస్కౌంట్లు ఉన్నాయి. గుంటూరు, మంగళగిరిలోని యర్రబాలెంలో 60% డిస్కౌంట్‌తో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశాం. VJAలోని ఆప్కో మెగా షో రూమ్‌లో 50%, మిగిలిన అన్ని షో రూముల్లో 40% డిస్కౌంట్లు ఉన్నాయి. 2 రోజుల్లోగా సహకారసంఘాల నుంచి చేనేత వస్త్రాల కొనుగోళ్లు ప్రారంభమవుతాయి’ అని తెలిపారు.


