News December 15, 2025
దేశంలోనే తొలిసారి.. భోగాపురంలో

దేశంలోనే మొదటి ఏవియేషన్-ఏరోస్పేస్-డిఫెన్స్ ఎడ్యుకేషన్ సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేసింది. భోగాపురం ఎయిర్‌పోర్ట్ సమీపంలో GMR మాన్సాస్ ఆధ్వర్యంలో నిర్మించనున్న ఎడ్యుసిటీని మంత్రులు లోకేశ్, రామ్మోహన్ ఈనెల 16న విశాఖలోని రాడిసన్ బ్లూ రిసార్ట్‌లో ప్రారంభిస్తారు. విమానయాన, రక్షణ రంగాల్లో పెరుగుతున్న అవకాశాలకు అనుగుణంగా యువతకు శిక్షణ, ఉద్యోగావకాశాలు కల్పించడం ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ఉద్దేశం.
Similar News
News March 4, 2026
అమెరికా-ఇరాన్ పోరుపై RGV ట్వీట్

మిడిల్ఈస్ట్‌ను ఉద్రిక్త పరిస్థితుల్లోకి నెట్టేసిన అమెరికా-ఇరాన్ పోరుపై డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. ఈ ఇరు దేశాల మధ్య యుద్ధం జీసస్ – అల్లాకు మధ్య జరుగుతున్న పోరుగా పేర్కొన్న RGV.. ఎవరు గెలిస్తే వారి మతంలోకి మారుతానన్నారు. అమెరికాలో మెజార్టీ క్రిస్టియన్లు ఉండటం, ఇరాన్ ఇస్లామిక్ కంట్రీ కావడంతో ఇది రెండు సిద్ధాంతాల మధ్య పోరు అన్నట్లుగా వర్మ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది.
News March 4, 2026
వైసీపీ కోఆర్డినేటర్లుగా కన్నబాబు, బొత్స కొనసాగింపు

వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్లను నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు ఇచ్చింది. ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్‌గా కురసాల కన్నబాబు, ఉమ్మడి గోదావరి జిల్లాల కోఆర్డినేటర్‌గా బొత్స సత్యనారాయణలను యధావిధిగా కొనసాగించింది. వీరి బాధ్యతల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. పార్టీ బలోపేతానికి, నాయకుల మధ్య సమన్వయానికి వీరిద్దరి అనుభవం తోడ్పడుతుందని అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం.
News March 4, 2026
కృష్ణా: చల్లారని ప్రొటోకాల్ చిచ్చు.. TDPలో దుమారం

తిరువూరు MLA కొలికిపూడి శ్రీనివాస్, VJA MP కేశినేని చిన్ని మధ్య తలెత్తిన రాజకీయ దుమారం ఇప్పట్లో చల్లారేలా లేదు. నెమలి ఆలయం వద్ద ప్రొటోకాల్ విషయంలో వీరి మధ్య వివాదం తేలెత్తింది. ఈ అంశాన్ని కొలికిపూడి తనదైన శైలిలో స్టేటస్ పెట్టగా, MP వర్గం సవాల్‌గా తీసుకుంది. AP సామాజిక సంక్షేమ బోర్డు ఛైర్మన్ పోతుల బాలకోటయ్య ఆలయ ఘటన, పూర్వాపరాలతోపాటు మరో 2 అంశాలతో నేడు విలేకర్ల సమావేశం ఏర్పాటు చేయనున్నారు.


