News December 15, 2025

దేశంలోనే తొలిసారి.. భోగాపురంలో

image

దేశంలోనే మొదటి ఏవియేషన్-ఏరోస్పేస్-డిఫెన్స్ ఎడ్యుకేషన్ సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేసింది. భోగాపురం ఎయిర్‌పోర్ట్ సమీపంలో GMR మాన్సాస్ ఆధ్వర్యంలో నిర్మించనున్న ఎడ్యుసిటీని మంత్రులు లోకేశ్, రామ్మోహన్ ఈనెల 16న విశాఖలోని రాడిసన్ బ్లూ రిసార్ట్‌లో ప్రారంభిస్తారు. విమానయాన, రక్షణ రంగాల్లో పెరుగుతున్న అవకాశాలకు అనుగుణంగా యువతకు శిక్షణ, ఉద్యోగావకాశాలు కల్పించడం ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ఉద్దేశం.

Similar News

News December 18, 2025

మెదక్: ఎన్నికల్లో రూ. 1,01,32,000 స్వాధీనం

image

మెదక్ జిల్లాలో మూడు విడతల ఎన్నికల చేపట్టిన తనిఖీలలో రూ. 1,01,32,000 విలువైన నగదు, లిక్కర్, పిడిఎస్ బియ్యం పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు తెలిపారు. రూ. 47.48 లక్షల నగదు, 268 కేసుల్లో రూ. 26,46,968 విలువైన 3688 లీటర్ల మద్యం, రూ. 27.36 లక్షల విలువైన 673 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యము స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.

News December 18, 2025

నెల్లూరు కలెక్టర్‌కు CM ప్రశంస

image

అమరావతిలోని సచివాలయంలో బుధవారం CM చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా పాల్గొన్నారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యం అని CM చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. CM.. సూపర్ సిక్స్, సూపర్ హిట్ ప్రాజెక్ట్‌లో సక్సెస్ సాధించిన కలెక్టర్లను అభినందించారు. ఫైల్ క్లియరెన్స్‌లో 2వ స్థానం సాధించినందుకు హిమాన్షు శుక్లాను CM ప్రత్యేకంగా ప్రశంసించారు.