News October 14, 2025
దేశంలోనే తొలి డ్రోన్ హబ్ ఓర్వకల్లులోనే..

దేశంలోనే తొలి <<18000986>>డ్రోన్ <<>>హన్ కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ఏర్పాటు కానుంది. ఈ నెల 16న ప్రధాని నరేంద్ర మోదీ దీని నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. డ్రోన్ల వినియోగానికి విస్తృత అవకాశాలున్న మ్యాపింగ్, సర్వే, వ్యవసాయం, ఫొటోగ్రఫీ, తనిఖీలు, నిఘా రంగాలను ప్రభుత్వం కీలకంగా భావిస్తోంది. డ్రోన్ల రంగంలో మన దేశ వాటా కేవలం 3 శాతం కాగా దీన్ని 20 శాతానికి పెంచాలని కేంద్రం భావిస్తోంది.
Similar News
News October 14, 2025
5 ఛానళ్లను మూసివేస్తున్న MTV

90’s, 2000’sలో సంగీత ప్రియులను అలరించిన TV మ్యూజిక్ ఛానల్ MTV బ్రాడ్ కాస్ట్ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది డిసెంబర్ 31కల్లా MTV మ్యూజిక్, 80’s, 90’s, క్లబ్, లైవ్ ఛానళ్లను శాశ్వతంగా మూసివేస్తున్నట్లు పేర్కొంది. ఆడియన్స్ యూట్యూబ్, టిక్ టాక్, స్పాటిఫై వంటి ఇతర వేదికలకు మళ్లడంతో ఈ ఛానళ్లకు డిమాండ్ తగ్గినట్లు వెల్లడించింది. అయితే MTV ఛానెల్ మాత్రం ఉంటుందని తెలిపింది.
News October 14, 2025
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ NOV 18కి వాయిదా

TG ఫోన్ ట్యాపింగ్ కేసుపై సుప్రీం కోర్టు విచారణ చేసింది. ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ రద్దు చేయాలని ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ మహదేవన్ ధర్మాసనం విచారించింది. ఫోరెన్సిక్ నిపుణుల ముందు ‘ఐ క్లౌడ్ పాస్ వర్డ్ రీసెట్’ చేయాలని ప్రభాకర్‌ను ఆదేశించింది. కాగా అతడి మధ్యంతర బెయిల్‌ను పొడిగిస్తూ తదుపరి విచారణ నవంబర్ 18కి వాయిదా వేసింది.
News October 14, 2025
అమ్మో కోఠి ENT.. ఇకనైనా మారుతుందా..?

దశాబ్దాల చరిత్ర కలిగిన HYD కోఠి ప్రభుత్వ ENT ఆస్పత్రి ప్రస్తుతం రోగులు, వైద్య సిబ్బందికి నరకంగా మారింది. ఆస్పత్రి ఆవరణ, వార్డుల్లోకి సమీప మురుగు నీరు రావడంతో ప్రాణాలను నిలబెట్టాల్సిన చోటే అపరిశుభ్రత, తీవ్ర దుర్వాసన రాజ్యమేలుతోంది. దీంతో తెలంగాణ మెడికల్ సర్వీసెస్ కార్పొరేషన్(TGMSIDC) నూతన సమీకృత భవన నిర్మాణానికి రూ. 24.38 కోట్ల టెండర్‌ను ఆహ్వానించగా 18 నెలల్లో ఆసుపత్రిని ఆధునికీకరించనుంది.