News December 16, 2025
దేశంలో తొలి AAD ఎడ్యుకేషన్ సిటీ ప్రారంభించనున్న లోకేశ్

విజయనగరం జిల్లా భోగాపురంలో దేశంలోనే తోలి ఏవియోషన్ ఏరోస్పేస్, డిఫెన్స్(AAD) ఏడ్యుకేషన్ సిటీని విశాఖలోని రాడిసన్ బ్లూ రిసార్ట్‌లో నేడు లాంఛనంగా మంత్రి లోకేశ్ ప్రారంభించనున్నారు. జీఎంఆర్-మాన్సాస్ అధ్యర్యంలో భోగాపురం ఎయిర్ పోర్టుకు సమీపంలో 160 ఎకరాల స్థలంలో స్థాపించనున్నారు. ఈకార్యక్రమంలో గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొనున్నారు. ఇప్పటికే లోకేశ్ విశాఖకు చేరుకున్నారు.
Similar News
News December 18, 2025
అమెజాన్‌లో మరోసారి ఉద్యోగాల కోత

అమెజాన్ మరోసారి ఉద్యోగులను తొలగిస్తోంది. లక్సెంబర్గ్‌లోని యూరోపియన్ హెడ్‌క్వార్టర్స్‌లో 370 జాబ్స్‌కు కోత పెట్టనుంది. అక్కడ ఈ స్థాయిలో ఉద్యోగులను తొలగించడం కంపెనీ చరిత్రలో తొలిసారి. AI వినియోగంపై దృష్టిపెట్టిన అమెజాన్ 14 వేలకు పైగా ఉద్యోగులను తొలగిస్తామని అక్టోబర్‌లో ప్రకటించింది. లక్సెంబర్గ్‌లో తొలుత 470 మందిని తొలగించాలని కంపెనీ నిర్ణయించింది. అయితే స్టాఫ్‌తో చర్చల తర్వాత ఆ సంఖ్యను తగ్గించింది.
News December 18, 2025
తిరుపతి జిల్లాలో 139 క్వారీల్లో మైనింగ్

తిరుపతి జిల్లాలో ప్రస్తుతం 139 క్వారీలు ఉన్నాయిమొత్తం 662.48 హెక్టార్ల విస్తీర్ణంతో మైనింగ్ జరుగుతోంది. సత్యవేడు మండలంలోనే అత్యధికంగా 22 క్వారీ లీజులు ఉన్నాయి. పుత్తూరు, తొట్టంబేడు మండలాల్లో 18, ఆర్.సి.పురం మండలంలో 15, పాకాలలో 13, చంద్రగిరిలో 12 లీజులు, బీఎన్.కండ్రిగ మండలంలో 9 క్వారీలు లీజుపై నడుస్తున్నాయి. వరదయ్యపాలెం, తిరుపతి రూరల్, శ్రీకాళహస్తి, తదితర మండలాల్లోనూ పరిమిత సంఖ్యలో లీజులు ఉన్నాయి.
News December 18, 2025
మేడారం జాతరకూ.. మహాలక్ష్మి పథకం: MD

మేడారం జాతరకు ఈ సారి మహిళలకు మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నట్లు RTC ఎండీ నాగిరెడ్డి తెలిపారు. HYD నుంచి మేడారం వెళ్లే మహిళా ప్రయాణికులకు ఈ పథకం వర్తిస్తుందని ఆయన వివరించారు. జాతరకు వెళ్లే మహిళలకు సౌకర్యవంతమైన, భద్రమైన ప్రయాణం కల్పించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ప్రభుత్వం తరఫున అవసరమైన ఏర్పాట్లు పూర్తిచేసినట్లు, మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.


