News October 4, 2025
దేశం మోదీ చేతుల్లో సురక్షితం: బీజేపీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు

పెద్దపల్లి ప్రెస్ క్లబ్‌లో జరిగిన బీజేపీ నేతల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు సంజీవరెడ్డి ఈరోజు మాట్లాడారు. ప్రధాని మోదీ సాహసోపేత నిర్ణయాలతో దేశం శత్రుదేశాలకు తలవంచని శక్తిగా మారిందన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో అధిక స్థానాలు గెలుస్తామని, కాంగ్రెస్ 420 హామీలతో ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. రాష్ట్రంలో అవినీతి పెరిగిందని, బీజేపీ జెండా జిల్లాలో ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు.
Similar News
News October 5, 2025
ఆలస్యం చేస్తే ఊరుకోను.. ట్రంప్ వార్నింగ్

తన ప్రకటనపై హమాస్ వేగంగా స్పందించాలని అమెరికా అధ్యక్షుడు <<17906657>>ట్రంప్ హెచ్చరించారు<<>>. ‘బందీలను విడుదల చేసేందుకు, శాంతి ఒప్పందాన్ని అమలు చేసేందుకు తాత్కాలికంగా బాంబింగ్ ఆపినందుకు ఇజ్రాయెల్‌ను అభినందిస్తున్నా. హమాస్ వైపు నుంచి ఏదైతే జరుగుతుందని అందరూ భావిస్తున్నారో అలాంటి ఆలస్యాన్ని నేను సహించను. బందీలను విడుదల చేసే ప్రక్రియను త్వరగా పూర్తి చేయండి. అందరితో న్యాయంగా వ్యవహరిస్తాం’ అని SMలో పోస్ట్ చేశారు.
News October 5, 2025
జీఎస్టీతో పరిశ్రమలకు లబ్ధి: కలెక్టర్

భారతదేశంలో GST సంస్కరణల అమలుతో జౌళి, విద్యుత్, చేనేత పరిశ్రమలకు ఎంతో లబ్ధి చేకూరుతుందని జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ అన్నారు. జీఎస్టీ 2.0పై నెల రోజులపాటు జరిగే అవగాహన సదస్సులో భాగంగా ‘సూపర్ సేవింగ్స్’ అంశాలపై అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. జిల్లా కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన స్టాళ్లను సేల్స్ టాక్స్, కమర్షియల్ టాక్స్ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు.
News October 5, 2025
విశాఖలో పర్యటించనున్న కేంద్ర మంత్రి

కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ సోమవారం విశాఖలో పర్యటించనున్నారు. 5న రాత్రి విశాఖ చేరుకొని హోటల్లో బస చేస్తారు. 6న ఉదయం 10 గంటలకు పోర్టు ఎల్పీజీ బెర్త్ వద్ద శివాలిక్ నౌకను ప్రారంభిస్తారు. సాయంత్రం 4 గంటలకు సాగరమాల కన్వెన్షన్‌లో విశాఖ పోర్టు ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. సాయంత్రం 6.15కి విశాఖ నుంచి బయలుదేరి ఢిల్లీ వెళ్తారు.