News December 30, 2024

దేశమంతటికీ ఆమె గర్వకారణంగా నిలిచింది: MP అర్వింద్

image

భారత గ్రాండ్ మాస్టర్, తెలుగు తేజం కోనేరు హంపి ఫీడే మహిళల వరల్డ్ ర్యాపిడ్ చేస్ ఛాంపియన్‌గా నిలిచారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కోనేరు హంపీకి ‘X’ వేదికగా అభినందనలు తెలిపారు. ఈ వేదికగా ఆమె ఫోటోను జోడించిన ఎంపీ అర్వింద్ ఈ అపూర్వ విజయంతో ఆమె దేశమంతటికీ గర్వకారణంగా నిలిచిందని ప్రశంసించారు.

Similar News

News January 2, 2025

NZB: బీసీ మహాసభల పోస్టర్‌ ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత

image

నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత హైదరాబాదులోని ఆమె నివాసంలో బుధవారం బీసీ మహాసభల పోస్టర్‌‌ను ఆవిష్కరించారు. శాతవాహన యూనివర్సిటీ నాయకులు మహేశ్ మాట్లాడుతూ..ఈ నెల 3వ తేదీన సావిత్రి పూలే జయంతి సందర్భంగా ఇంద్ర పార్క్ వద్ద బీసీ మహా సభలను నిర్వహించనున్నట్లు తెలిపారు. బీసీలోని అన్ని కుల సంఘాల నాయకులు, పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. రమేష్, అన్వేష్, శివ, పవన్, ప్రేమ్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.

News January 2, 2025

జైలుకు వెళ్లి వచ్చిన వారు క్రైం రేటు పెరిగిందంటున్నారు: షబ్బీర్ ఆలీ

image

జైలుకు వెళ్లి వచ్చిన బీఆర్ఎస్ నేతలు రాష్ట్రంలో నేరాలు పెరిగాయని, క్రైం రేటు పెరిగిందని వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే నేరాలు అధికంగా జరిగాయని ఆరోపించారు. ఒక మహిళ అయి ఉండి లిక్కర్ వ్యాపారం చేసి అందరిని తాగుబోతులుగా మార్చి క్రైమ్ రేట్ పెంచారని విమర్శించారు.

News January 2, 2025

NZB: నేడు జిల్లాకు ఏకసభ్య కమిషన్

image

ఎస్సీ వర్గీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏక సభ్య కమిషన్ గురువారం ఉపవర్గీకరణ, వివరణాత్మక అధ్యయనం కోసం జిల్లాకు వస్తుందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాలోని ఎస్సీ కులానికి చెందిన వారు హాజరై వినతులను అందివచ్చని సూచించారు. తెలంగాణ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టీస్ డాక్టర్ షమీమషమీమ్ అక్తర్ తో కూడిన ఏక సభ్య కమిషన్ కు దరఖాస్తు చేసుకోవచ్చారు.