News July 6, 2024
దేశానికి, రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురండి: రాంప్రసాద్ రెడ్డి
పారిస్ ఒలింపిక్స్‌కు రాష్ట్రం నుంచి 7మంది క్రీడాకారులు అర్హత సాధించినట్లు ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ(శాప్) ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సింధు, సాత్విక్ సాయిరాజ్(బ్యాడ్మింటన్), ధీరజ్ (ఆర్చరీ), జ్యోతి, జ్యోతికశ్రీ(అథ్లెటిక్స్), నారాయణ (పారా రోయింగ్), ఆర్షద్ (పారా సైక్లింగ్)లు ఉన్నారు. వారిని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అభినందించి దేశానికి, రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతలు తేవాలన్నారు.
Similar News
News November 27, 2024
కృష్ణా: విద్యార్థులకు అలర్ట్.. నోటిఫికేషన్ విడుదల
కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కాలేజీలలో ఆగస్టు 2024లో నిర్వహించిన బీఈడీ, స్పెషల్ బీఈడీ 1వ సెమిస్టర్ పరీక్షలకు(2023-24 విద్యా సంవత్సరం) సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్ కోరుకునే విద్యార్థులు డిసెంబర్ 2లోపు ఒక్కో పేపరుకు నిర్ణీత ఫీజు రూ.900 చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ తెలిపింది. ఆన్లైన్లో ఫీజు చెల్లింపుకై https://kru.ac.in/ అధికారిక వెబ్సైట్ చూడాలంది.
News November 27, 2024
కృష్ణా: ధాన్యం విక్రయాలకు ప్రత్యేక కంట్రోల్ రూమ్
జిల్లాలో ఖరీఫ్ ధాన్యం విక్రయాలకు సంబంధించి ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామని కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. ధాన్యం విక్రయాలకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు, సమస్యలు ఉన్నా 8247693551 నంబర్‌కి ఫోన్ చేసి తెలియపర్చవచ్చన్నారు.
News November 27, 2024
కొనకళ్ల కోడలి చీర మిస్సింగ్.. నోటీసుల జారీ
మచిలీపట్నం మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ కొడలు చీర కార్గో పార్శిల్లో మాయమైందని పలు ప్రచార మాధ్యమాల్లో వచ్చింది. ఈ నేపథ్యంలో వినుకొండ ఆర్టీసీ డీపో మేనేజర్‌ను వివరణ కోరగా, ఈ ఘటనపై డీఎం మాట్లాడారు. ఒంగోలు నుంచి నెల్లూరుకు ఇచ్చిన పార్శిల్లో ఒక చీర మాయం అయినట్లు తెలిసిందన్నారు. ఈ సంఘటనపై హైయర్ బస్సు ఓనర్, డ్రైవర్‌కు నోటీసులు జారీ చేశామని చెప్పారు. త్వరలో వారు వచ్చి వివరణ ఇస్తారని తెలిపారు.