News December 24, 2024

దేశానికి వాజపేయి సేవలు వెలకట్టలేనివి: ఎంపీ రఘునందన్

image

తాజ్ దక్కన్‌లో ABV ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజపేయి శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, ఎంపీ సుధాన్షు తివారీతో కలిసి మెదక్ ఎంపీ రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ.. ప్రధానిగా వాజపేయి దేశానికి చేసిన సేవలు వెలకట్టలేనివని అంటు ఆయన సేవలను కొనియాడారు.

Similar News

News November 6, 2025

డిసెంబర్ 3 నుంచి జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన

image

మెదక్ జిల్లాలోని పాఠశాలల విద్యార్థుల కోసం (6 నుండి 12వ తరగతి) జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన, ఇన్‌స్పైర్ అవార్డ్స్ ఎగ్జిబిషన్‌ను నిర్వహించనున్నట్లు డీఈవో రాధాకిషన్ తెలిపారు. ఈ ప్రదర్శనలు డిసెంబర్ 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు స్థానిక వెస్లీ ఉన్నత పాఠశాలలో జరుగుతాయి. ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపల్స్‌లు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డీఈవో సూచించారు.

News November 6, 2025

కౌడిపల్లి: కోళ్ల వ్యాన్ ఢీకొని వ్యక్తి మృతి

image

కౌడిపల్లి మండలం వెంకట్రావుపేట్ వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. వెంకట్రావుపేట్ గ్రామానికి చెందిన కొన్యాల దత్తయ్య(57) నడిచి వెళ్తుండగా.. రాంగ్‌రూట్‌లో వచ్చిన కోళ్ల వ్యాన్ ఢీకొట్టింది. స్థానికులు వెంటనే దత్తయ్యను అంబులెన్స్ వాహనంలో హైదరాబాద్ తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News November 6, 2025

‘మెదక్ జిల్లాలో బాల్య వివాహాలు జరగవద్దు’

image

మెదక్ జిల్లాలో బాల్యవివాహాలు జరగకుండా చూడాలని, అలాగే డ్రగ్స్ నిర్మూలన, ఫోక్సో చట్టంపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్‌ రాహుల్ రాజ్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించాలని, బాల కార్మికులు లేకుండా చూడాలని, బాలల హక్కులను రక్షించాలని సూచించారు. డ్రగ్స్ నిరోధం, ఫోక్సో చట్టాలపై ప్రచారం పెంచాలని దిశానిర్దేశం చేశారు.