News January 27, 2026
దేశాన్ని రాజుల యుగంలోకి నెట్టే ప్రయత్నం: రాహుల్ గాంధీ

ఉపాధి హామీ(MGNREGA) చట్టాన్ని కేంద్రం నాశనం చేసిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ‘కార్మికుల హక్కులు, పంచాయతీలు, రాష్ట్రాల అధికారాలను హరించడం, దేశాన్ని రాజుల కాలంలోకి నెట్టడమే ప్రభుత్వ ఉద్దేశం. అలా అయితే పవర్, సంపద కొద్దిమంది చేతుల్లోనే ఉంటుంది కదా. కనీస వేతనాలు, పనికి గ్యారంటీ, స్వేచ్ఛ, గౌరవంతో పని చేసే హక్కుతో MGNREGA తమ జీవితాలను మార్చిందని కార్మికులు అంటున్నారు.’ అని ట్వీట్ చేశారు.
Similar News
News February 21, 2026
మదనపల్లె మృగాడు మృతి.. CM ఏమన్నారంటే?

AP: మదనపల్లె హత్యాచార నిందితుడు కులవర్ధన్ ఆత్మహత్యపై CM చంద్రబాబు వినుకొండ సభలో స్పందించారు. ‘మదనపల్లెలో గంజాయి సేవించి మానవ మృగంగా ప్రవర్తించాడు. ఆడబిడ్డల జోలికొస్తే అది వారికి చివరి రోజు అవుతుందని హెచ్చరించా. చట్టం కఠినంగా వ్యవహరిస్తుందన్న భయంతో అతను ప్రాణాలు తీసుకున్నాడు’ అని చెప్పారు. ఘటన అనంతరం నిందితుడు ఆత్మహత్య చేసుకోగా మృతదేహాన్ని తీసుకోవడానికి కుటుంబీకులు ముందుకు రాని విషయం తెలిసిందే.
News February 21, 2026
చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

<
News February 21, 2026
అభిషేక్ ఫామ్‌పై కెప్టెన్ సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు

T20WCలో ఆడిన 3 మ్యాచుల్లోనూ అభిషేక్ డకౌట్ కావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ కెప్టెన్ సూర్య స్పందించారు. అభి గురించి ఆందోళన పడుతున్నవారి గురించి తాను ఆందోళన పడుతున్నట్లు చమత్కరించారు. అతడిని ఎదుర్కోబోతున్న ప్రత్యర్థి జట్లపై మరింత ఆందోళనగా ఉందన్నారు. అభి బ్యాట్‌తో ఏం చేస్తాడో గతేడాది చూశామని, ప్రస్తుతం మద్దతుగా నిలవాల్సిన టైమ్ అని చెప్పారు. దీంతో రేపటి మ్యాచ్‌లో అభిషేక్ ఆడటం కన్ఫర్మ్ అయినట్లే.


