News October 31, 2025
‘దేశ ఐక్యత, సమగ్రతకు పటేల్ కృషి చిరస్మరణీయం’

దేశ ఐక్యత, సమగ్రతకు సర్ధార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి చరిత్రలో చిరస్మరణీయమని, ఆయన ఆలోచనలు, స్ఫూర్తి నేటి తరానికి మార్గదర్శకమని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గితే అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన జయంతిని ఘనంగా నిర్వహించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి ఎస్పీ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అదనపు ఎస్పీ చంద్రయ్య పాల్గొన్నారు.
Similar News
News October 31, 2025
పెద్దపల్లి: ‘NOV 11న యువజనోత్సవ పోటీల నిర్వహణ’

PDPL యువజన క్రీడలశాఖ ఆధ్వర్యంలో NOV 11న 29వ జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా యువజన ఉత్సవ పోటీలు నిర్వహించనున్నట్లు డీవైఎస్‌ఓ సురేష్ తెలిపారు. జానపద నృత్యం, గేయం, కథారచన, పెయింటింగ్, కవిత్వం, ఇన్నోవేషన్ ట్రాక్ పోటీలు జరగనున్నాయి. జిల్లాస్థాయిలో విజేతలు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక అవుతారని చెప్పారు. ఆసక్తిగల యువతీ యువకులు PDPL అమర్‌నగర్ సిరి ఫంక్షన్ హాల్‌లో జరిగే పోటీలలో పాల్గొనాలని పిలుపునచ్చారు.
News October 31, 2025
శిర్డీలో వేమిరెడ్డి దంపతులు

నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులు శిర్డీకి వెళ్లారు. బాబాను శుక్రవారం దర్శించుకున్నారు. సాయినాథుడిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు.
News October 31, 2025
రాయచోటిలో అనుమానాస్పద స్థతిలో యువకుడి మృతి

రాయచోటిలో శుక్రవారం రాత్రి యువకుడు మృతి చెందిన ఘటన వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు.. రాయచోటి కడప రహదారిలోని హోటల్ దగ్గర లారీ ఢీకొని గుర్తు తెలియని యువకుడు అక్కడి కక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు మృతుడు ఎవ్వరనే విషయాన్ని ఇంత వరకు తేలలేదన్నారు. ఇది హత్య? లేక రోడ్డు ప్రమాదమా..? అని తెలియాల్సి ఉందన్నారు.


