News December 21, 2025
దేశ వ్యతిరేక శక్తులతో రాహుల్ కుమ్మక్కు: బీజేపీ

భారత వ్యతిరేక శక్తులతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేతులు కలుపుతున్నారని బీజేపీ నేత గౌరవ్ భాటియా ఆరోపించారు. జార్జ్ సోరోస్‌తో లింక్ ఉన్న బెర్లిన్ హెర్టీ స్కూల్ అధ్యక్షురాలు కార్నెలియా వోల్‌తో రాహుల్ సమావేశమయ్యారని తెలిపారు. ఆయన విదేశీ పర్యటనల్లో పారదర్శకత ఉండాలన్నారు. దాదాపు ప్రతి పార్లమెంట్ సెషన్ సమయంలో/ముందు రాహుల్ విదేశాల్లో పర్యటించడం కొత్తేమీ కాదని, వాటి వెనుక ఆంతర్యం ఏంటో చెప్పాలన్నారు.
Similar News
News December 26, 2025
KTR, హరీశ్‌ను బిగ్‌బాస్‌లోకి తీసుకోవాలని నాగార్జునకు లేఖ

TG: KTR, హరీశ్‌రావులను బిగ్‌బాస్‌లోకి తీసుకోవాలంటూ కాంగ్రెస్ నేత, ఫిషరీస్ కార్పొరేషన్ ఛైర్మన్ మెట్టు సాయికుమార్ హోస్ట్ నాగార్జునకు లేఖ రాశారు. రాజకీయ నటులుగా వీరు పేరు ప్రఖ్యాతులు పొందారని, అబద్ధాలు ఆడి మోసం చేయడంలో వీరికి వీరే సాటి అని ఎద్దేవా చేశారు. ఈ ఇద్దర్నీ తీసుకుంటే వచ్చే సీజన్‌లో రేటింగ్ అమాంతం పెరుగుతుందన్నారు. దీంతో తెలంగాణ ప్రజలకు మంచి ఎంటర్‌టైన్‌మెంట్ దొరుకుతుందని లేఖలో పేర్కొన్నారు.
News December 26, 2025
జగన్ ట్వీట్‌తో రంగా అభిమానుల్లో కొత్త చర్చ!

AP: వంగవీటి రంగా వర్ధంతి సందర్భంగా YCP చీఫ్ జగన్ ప్రత్యేకంగా <<18674822>>ట్వీట్<<>> చేయడం చర్చకు దారితీసింది. రంగా కుమారుడు రాధా YCPని వీడి గతంలో TDPలో చేరారు. తాజాగా కుమార్తె ఆశాకిరణ్ యాక్టివ్ అయ్యారు. భవిష్యత్తులో ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారని ఓసారి ఆమెను మీడియా అడగ్గా రాధారంగా మిత్రమండలి సలహాతో నడుస్తానన్నారు. ఆమెను పార్టీలో చేర్చుకోవాలని YCP ఆసక్తితో ఉందా? అనే సందేహాలు రంగా అభిమానుల్లో వ్యక్తమవుతున్నాయి.
News December 26, 2025
ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు

ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్(<


