News June 14, 2024

దైవ కార్యంగా భావిస్తా: హోం మంత్రి అనిత

image

సీఎం చంద్రబాబు నాయుడు తనకు అప్పగించిన బాధ్యతను దైవ కార్యంగా భావిస్తానని రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. తనకు కీలకమైన హోం శాఖను అప్పగించినందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ముఖ్యమంత్రి తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు.

Similar News

News December 25, 2025

విశాఖ వుడా మాజీ అధికారి ఆస్తులు ఈడీ అటాచ్!

image

విశాఖ వుడా మాజీ అదనపు చీఫ్ అర్బన్ ప్లానర్ ప్రదీప్‌కుమార్ ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. హైదరాబాద్‌లో ఉన్న రూ.1.09 కోట్ల విలువైన ఆస్తులు ఎటాచ్ చేసినట్లు ఈడీ పేర్కొంది. 2002లో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో పసుపర్తి ప్రదీప్‌కుమార్‌పై దాడులు నిర్వహించి ఈడీ కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆస్తులు జప్తు చేశారని తెలిపారు. జప్తు చేసిన వాటిలో ప్రదీప్‌కుమార్, ఆయన భార్య పేరిట ఉన్న ఇళ్లు, స్థలాలు ఉన్నాయి.

News December 25, 2025

స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ ప్రాజెక్ట్ పనులు ప్రారంభం

image

జీవీఎంసీ స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ ప్రాజెక్ట్‌ పనులు ప్రారంభించిందని అదనపు కమిషనర్ పీఎం సత్యవేణి తెలిపారు. జీవీఎంసీ హాల్లో సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆపరేషన్ లంగ్స్ లో దుకాణాలు తొలగింపు చేయడం జరిగిందని, విశాఖను అందంగా తీర్చిదిద్దేందుకు రూ.1425 కోట్లతో 250 దుకాణాలను మొదటి ప్రాజెక్టు కింద ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ప్రతి జోన్లో సమావేశాలు నిర్వహించి లబ్ధిదారుల ఎంపిక అన్ని జరుగుతాయని తెలిపారు.

News December 25, 2025

విశాఖలో పబ్ నిర్వాహకులకు సీపీ వార్నింగ్

image

విశాఖపట్నం నగరంలోని బార్, పబ్ నిర్వాహకులతో పోలీస్ కమిషనర్ సమావేశం నిర్వహించారు. ధ్వని కాలుష్యం, అక్రమ పార్కింగ్, డ్రగ్స్ వాడకం, మైనర్లకు మద్యం సరఫరాపై సీపీ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. నిర్ణీత సమయపాలన పాటించాలని, సిబ్బందికి పోలీస్ వెరిఫికేషన్ తప్పనిసరి అని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజల భద్రతే తమ ప్రాధాన్యతని ఆయన పేర్కొన్నారు.