News December 26, 2025

దొంగల ముఠాల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన జిల్లా పోలీసులు!

image

కామారెడ్డి జిల్లాలో వరుస దోపిడీలు, దారి దోపిడీలకు పాల్పడుతున్న ఐదు ముఠాలను ఈ ఏడాది పోలీసులు అరెస్ట్ చేశారు. పార్ది గ్యాంగ్ 1 & 2 లో 11 మందిని అరెస్ట్ చేసి, నలుగురిపై PD యాక్ట్ నమోదు చేశారు. కంజర్ భట్ & గడ్డపార గ్యాంగ్ లో 10 మందిని అరెస్ట్ చేసి, వారి నుంచి ₹15.45 లక్షల సొత్తు స్వాధీనం చేసుకున్నారు. సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు పాల్పడుతున్న ఐదుగురిని పట్టుకుని నగదు, ఫోన్లు సీజ్ చేశారు.

Similar News

News December 27, 2025

WGL: గ్రామ పాలనలో మహిళా శక్తి!

image

జీపీ ఎన్నికల్లో 50% మహిళా రిజర్వేషన్‌తో జిల్లాలో 316 జీపీలకు ఎన్నికలు జరగగా 158 మంది మహిళలు సర్పంచులుగా గెలిచారు. జిల్లాలోని అన్ని మండలాల్లో మహిళామణులు తమ సత్తా చాటుకున్నారు. ఇక సర్పంచ్ స్థానాల్లో మగవారు నిలిచిన చోట ఉప సర్పంచ్ మహిళలకు, మహిళలు ఉన్న చోట మగవారికి అవకాశం వచ్చింది. పాలనపై పట్టులేకున్నా, కుటుంబ బాధ్యతలతో పాటు గ్రామాభివృద్ధి బాధ్యతను మోస్తామని మహిళా సర్పంచులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

News December 27, 2025

AIIMS రాయపుర్‌లో 100 సీనియర్ రెసిడెంట్స్ పోస్టులు

image

<>AIIMS <<>>రాయపుర్‌ 100 Sr. రెసిడెంట్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి MBBS, MD/MS/DNB/డిప్లొమా ఉత్తీర్ణులు JAN 6 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45 ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.1000, మహిళలు, SC,ST, PwBDలకు ఫీజు లేదు. నెలకు రూ. 67,000+అలవెన్సులు చెల్లిస్తారు. https://www.aiimsraipur.edu.in

News December 27, 2025

వరుసగా 5 సెంచరీలతో రికార్డు

image

విజయ్ హజారే ట్రోఫీలో విదర్భ బ్యాటర్ ధ్రువ్ షోరే రికార్డు సృష్టించారు. హైదరాబాద్‌తో రాజ్‌కోట్‌లో నిన్న జరిగిన మ్యాచ్‌లో 77 బంతుల్లో అజేయంగా 109 పరుగులు (9 ఫోర్లు, 6 సిక్స్‌లు) చేసి జట్టుకు ఘన విజయాన్ని అందించారు. దీంతో లిస్ట్-A క్రికెట్‌లో వరుసగా 5 సెంచరీలు సాధించిన రెండో బ్యాటర్‌గా తమిళనాడు ప్లేయర్ జగదీశన్ రికార్డును సమం చేశారు. ఈ మ్యాచ్‌లో విదర్భ 365 రన్స్ చేయగా, హైదరాబాద్ 276కే పరిమితమైంది.