News June 14, 2024
దొనకొండ మండలంలో దొంగతనం

దొనకొండ మండలంలోని చిన్న గుడిపాడులో గురువారం రాత్రి దొంగతనం జరిగింది. గ్రామానికి చెందిన చౌదల కృష్ణారెడ్డి ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి బీరువా పగలగొట్టి అందులో ఉన్న రూ.50 వేల నగదు, బంగారు గొలుసు అపహరించారు. ఈ ఘటనపై శుక్రవారం దొనకొండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఏఎస్సై శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News February 18, 2026
మార్కాపురం జిల్లా మెడికల్ విద్యార్థిని సూసైడ్

మార్కాపురం జిల్లాలో మెడికల్ విద్యార్థిని సూసైడ్ తీవ్ర విషాదాన్ని నింపింది. కర్నూలు (D) గూడూరు(M) పెంచికలపాడులోని విశ్వభారతి మెడికల్ కాలేజీ సోనిక(22) సూసైడ్ చేసుకుంది. తర్లుపాడుకు చెందిన సోనిక పారామెడికల్ అనస్థీషియా ఫస్ట్ ఇయర్ చదువుతోంది. తల్లిదండ్రుల మధ్య విభేదాల కారణంగా ఆమె కొంతకాలంగా మనస్తాపంతో ఉండి మంగళవారం హాస్టల్‌లో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కె.నాగలాపురం SI అఖిల్ కేసు నమోదు చేశారు.
News February 18, 2026
ప్రకాశం: ఇళ్లు కట్టుకునేవారికి శుభవార్త

ఉగాది నాటికి నిర్దేశించిన లక్ష్యం మేరకు ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు అన్నారు. మంగళవారం ప్రకాశం భవన్ నుంచి మున్సిపల్ కమిషనర్లు, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హౌసింగ్, సచివాలయాల సేవలు, యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే, పారిశుద్ధ్యం, స్వామిత్వ సర్వేపై సమీక్షించారు. APMAY 2.0 పథకంతో చేపట్టిన ఇళ్ళ నిర్మాణంలో వేగం పెంచాలన్నారు.
News February 18, 2026
ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలి: ప్రకాశం కలెక్టర్

ఉగాది నాటికి నిర్దేశించిన లక్ష్యం మేరకు ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు అన్నారు. మంగళవారం ప్రకాశం భవనం నుంచి మున్సిపల్ కమిషనర్లు, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హౌసింగ్, సచివాలయాల సేవలు, యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే, పారిశుద్ధ్యం, స్వామిత్వ సర్వేపై సమీక్షించారు. APMAY 2.0 పథకంతో చేపట్టిన ఇళ్ళ నిర్మాణంలో వేగం పెంచాలన్నారు.


