News January 24, 2025
దోమకొండ గడికోటలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా

కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం గడికోటలోని మహాదేవుడిని బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మెుక్కులు చెల్లించుకున్నారు.ప్రియాంక చోప్రాకు గడికోట సభ్యులు, కమిటీ సభ్యులు ఘనస్వాగతం పలికారు. కాగా ప్రియాంక చోప్రా గతంలో హీరో రాంచరణ్ తేజ్‌తో కలిసి జంజీర్ సినిమాలో నటించింది. ఆ సమయంలో ఈ దేవాలయం ప్రత్యేకతను ప్రియాంకకు వివరించగా..తాజాగా ఆమె ఈ కోటను దర్శించుకున్నారు.
Similar News
News July 6, 2025
NLG: రేపటి వరకు అభ్యంతరాల స్వీకరణ

KGBVలో ప్రత్యేక అధికారులు, PGCRTలు, CRTలు, పీఈటీలు, ఏఎన్ఎం, అకౌంటెంట్ పోస్టులతో పాటు అదేవిధంగా టీజీ MSGHలో ఖాళీగా ఉన్న పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసినట్లు డీఈవో భిక్షపతి తెలిపారు. అభ్యంతరాలు ఉంటే ఆధారాలతో ఈ నెల 7వ తేదీ వరకు ఫిర్యాదులు చేయాలని ఒక ప్రకటనలో తెలిపారు. 1:1 నిష్పత్తిలో సబ్జెక్టుల వారీగా అభ్యర్థులు జాబితాను డీఈవో వెబ్సైట్లో పొందు పరిచామని తెలిపారు.
News July 6, 2025
అందరూ ఇంకుడు గుంతలు నిర్మించండి: MD

గ్రేటర్ HYDలో వర్షపు నీటిని ఒడిసి పట్టేందుకు ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతలు నిర్మించాలని జలమండలి ఎండి అశోక్ రెడ్డి సూచించారు. జలమండలి పరిధిలో ఇంకుడు గుంతలకు సంబంధించి ప్రతి ఇంటింటికి సర్వే నిర్వహించింది. సర్వేలో 40,206 ఇండ్లను గుర్తించిన అధికారులు, ఇంకుడు గుంతలు 22,813 భవనాల్లో ఉన్నట్లుగా గుర్తించారు.17,393 భవనాలలో ఇంకుడు గుంతలు లేవు. దీని కారణంగా 16,066 మందికి జలమండలి నోటీసులు జారీ చేసింది.
News July 6, 2025
బల్లికురవ PS పరిధిలో 53 క్రిమినల్ కేసులు రాజీ

అద్దంకి కోర్టులో శనివారం లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లుగా బల్లికురవ ఎస్సై నాగరాజు తెలిపారు. ఈ నేపథ్యంలో బల్లికురవ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు కేసులు పరిష్కారమయ్యాయని ఆయన చెప్పారు. 403 కేసులకు సంబంధించి జరిమానా అలాగే 53 క్రిమినల్ కేసులకు సంబంధించి రాజీ పడినట్లుగా ఎస్సై పేర్కొన్నారు. రాజీ అనేది ఉత్తమ మార్గమని ఎస్సై అన్నారు.