News October 18, 2025

దోమకొండ టు గిన్నిస్ వరల్డ్ రికార్డ్

image

దోమకొండకు చెందిన దేవరగట్టు బాలప్రసాద్ 17 ఏళ్ల కృషికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో చోటు దక్కింది. తన ఆలోచనలను, సాంకేతికతను, మానవత్వాన్ని జోడించి నాయకుడిగా ఉద్యోగులను చేర్చాడు. ఖచ్చితమైన విశ్వాసంతో జనరేటివ్ AI హ్యాకథాన్ మార్పుతో కోడర్‌గా, సృష్టికర్తగా స్వీకరించి, యాప్‌గా కాకుండా మిషన్‌గా భావించాడు. జీవితంలో ప్రేరణ అనేది చాలా ముఖ్యమని ఆయన అన్నారు.

Similar News

News October 18, 2025

మంచిర్యాల: ఎక్సైజ్ టెండర్లకు భారీ స్పందన

image

మంచిర్యాల జిల్లాలో ఎక్సైజ్ టెండర్లకు భారీ స్పందన కనిపించింది. జిల్లాలోని ఏర్పాటుచేసిన పలు కేంద్రాల వద్ద శుక్రవారం 433 దరఖాస్తులు వచ్చినట్లుగా జిల్లా అధికారులు తెలిపారు. ఇప్పటివరకు మంచిర్యాలలో 263, బెల్లంపల్లి 185, లక్షెట్టిపేట 109, చెన్నూరు 98, మొత్తంగా 655 దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించారు.

News October 18, 2025

సమ్మె విరమించిన విద్యుత్ ఉద్యోగ సంఘాలు

image

AP: విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై జేఏసీ నాయకులతో 12 గంటలు సుధీర్ఘంగా జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ప్రధాన డిమాండ్లకు యాజమాన్యాలు ఒప్పుకోవడంతో సమ్మె విరమిస్తున్నట్లు JAC నాయకులు ప్రకటించారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేసేందుకు, వారికి నేరుగా ప్రభుత్వం జీతాలు చెల్లించేందుకు అంగీకరించింది. 1999-2004 మధ్య ఎంపికైన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానంపై కమిటీకి కూడా అంగీకారం లభించింది.

News October 18, 2025

ధన త్రయోదశి ఎందుకు జరుపుకొంటారు?

image

ధంతేరస్‌ను జరుపుకోవడానికి ప్రధాన కారణం.. ఈ రోజున ఆరోగ్య ప్రదాత ధన్వంతరి క్షీరసాగర మథనం నుంచి ఉద్భవించడం. ఈ పండుగను దీపావళికి శుభారంభంగా పరిగణిస్తారు. ఈరోజు లక్ష్మీదేవిని, కుబేరుడిని పూజించడం వల్ల సంపద, శ్రేయస్సు కలుగుతాయి. నూతన పెట్టుబడులకు, విలువైన వస్తువుల కొనుగోలుకు ఇది శుభ సమయం. అలాగే ఇల్లు, మనస్సులను శుద్ధి చేసుకొని పండుగకు సిద్ధపడడం ద్వారా ఆనందం, అదృష్టం లభిస్తాయని ఈ పండుగ తెలియజేస్తుంది.