News March 1, 2025
దోమలో బాలికపై యువకుడి అఘాయిత్యం

నాలుగేళ్ల బాలికపై యువకుడు లైంగికదాడికి యత్నించిన ఘటన దోమ PS పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు.. ఓ గ్రామానికి చెందిన యువకుడు (20), తన ఇంటి సమీపంలో ఉండే చిన్నారిపై లైంగికదాడికి యత్నించాడు. ఇది గమనించిన స్థానికులు అతడిని పట్టుకొని చితకబాది పోలీసులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని ఎస్ఐ తెలిపారు.
Similar News
News March 1, 2025
మరోసారి తండ్రైన మస్క్.. మొత్తం 14 మంది పిల్లలు

అపరకుబేరుడు ఎలాన్ మస్క్ మరోసారి తండ్రయ్యారు. తన ప్రేయసి, న్యూరాలింక్ ఎగ్జిక్యూటివ్ శివోన్ జిలిస్ నాల్గో బిడ్డకు జన్మనిచ్చింది. ఈ 14వ సంతానానికి సెల్డన్ లైకుర్గస్ అనే పేరు పెట్టినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. కాగా, మొదటి భార్య జస్టిన్ విల్సన్‌తో ఆరుగురు, మాజీ లవర్ గ్రిమ్స్‌తో ముగ్గురు, రచయిత ఆష్లే సెయింట్‌తో ఒక్కరు, శివోన్ జిలిస్‌తో నలుగురు పిల్లలు ఉన్నారు.
News March 1, 2025
కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న సస్పెండ్

TG: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. ఇటీవల బీసీ సభలో ఓ వర్గంపై మల్లన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు హైకమాండ్ గుర్తించింది. ఆ వ్యాఖ్యలపై ఫిబ్రవరి 12 లోపు వివరణ ఇవ్వాలని FEB 5న షోకాజ్ నోటీసులు ఇచ్చింది. మల్లన్న స్పందించకపోవడంతో పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది.
News March 1, 2025
రామగుండం: ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తి ప్రకటించిన CGM

రామగుండంలోని ఎరువుల కర్మాగారం (RFCL) ఈ ఏడాది ఫిబ్రవరి చివరినాటికి 103912.38 మెట్రిక్ టన్నుల యూరియాను ఉత్పత్తి చేసినట్లు యాజమాన్యం ప్రకటించింది. కర్మాగారంలో ఉత్పత్తి అయిన నీమ్ కోటెడ్ యూరియాను తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నట్లు ప్లాంటు CGMఉదయ్ రాజహంస ప్రకటించారు. ప్లాంటు అధికారులకు, ఉద్యోగులను CGM అభినందించారు.