News December 17, 2025
దోమలో లాటరీ సర్పంచ్

దోమ మండలం పాలేపల్లి గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఇద్దరు సర్పంచ్ అభ్యర్థులకు 469 సమాన సంఖ్యలో ఓట్లు రావడంతో ఫలితం తేలలేదు. ఎన్నికల నిబంధనల ప్రకారం అధికారులు లాటరీ పద్ధతిని అమలు చేశారు. అధికారుల సమక్షంలో నిర్వహించిన లాటరీలో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పోటీ చేసిన బచ్చి గారి సుజాత విజయం సాధించారు.
Similar News
News December 18, 2025
నాణ్యమైన నిద్ర కోసం 10-3-2-1-0 రూల్!

10-3-2-1-0 రూల్‌తో నాణ్యమైన నిద్ర సొంతమవుతుంది. నిద్రకు 10 గంటల ముందు కెఫిన్ ఉండే పదార్ధాలను (టీ, కాఫీ) తీసుకోవద్దు. 3 గంటల ముందే భోజనం చేయాలి. ఆల్కహాల్ తాగొద్దు. 2 గంటల ముందు పని, ఒత్తిడికి ఫుల్‌స్టాప్ పెట్టాలి. గంట ముందు మొబైల్/ల్యాప్‌టాప్ స్క్రీన్ ఆఫ్ చేయాలి. మార్నింగ్ అలారం మోగిన వెంటనే లేవాలి. స్నూజ్ బటన్ ఉపయోగించొద్దు. ఈ రూల్స్‌తో నిద్ర నాణ్యత పెరిగి రోజంతా ఫ్రెష్‌గా ఉంటారు. ప్రయత్నించండి!
News December 18, 2025
రేపు గవర్నర్‌తో భేటీ కానున్న జగన్

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమంలో భాగంగా రేపు మధ్యాహ్నం వైసీపీ అధ్యక్షుడు జగన్ గవర్నర్‌తో భేటీ కానున్నారు. ప్రజలు చేసిన సంతకాల పత్రాలను గవర్నర్‌కి అందిస్తారని ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ తెలిపారు.
News December 17, 2025
నార్త్‌లో ఎందుకు.. సౌత్‌లో వేదికల్లేవా? ఫ్యాన్స్ ఫైర్

పొగమంచుతో 4వ టీ20 రద్దు కావడంపై ఫ్యాన్స్ ఫైరవుతున్నారు. శీతాకాలంలో పొగమంచు కురిసే నార్త్ స్టేట్స్‌లో మ్యాచ్‌లు షెడ్యూల్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మంచు సమస్య ఉండే వేదికల్లో రాత్రి 7గంటలకు కాకుండా మధ్యాహ్నం మ్యాచ్‌లు నిర్వహిస్తే బాగుంటుందని సూచిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో పొగమంచు సమస్య తక్కువని ఇక్కడ క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించే ఛాన్స్‌లు పరిశీలిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.


