News September 1, 2024
దోర్నాల: ఘాట్ రోడ్‌లో విరిగిపడ్డ కొండ చరియలు

దోర్నాల- శ్రీశైలం ఘాట్ రోడ్‌లో భారీ వర్షాల కారణంగా ఆదివారం సాయంత్రం కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ నేపథ్యంలో అధికారులు దోర్నాల – శ్రీశైలం ఘాట్ రోడ్డును తాత్కాలికంగా మూసివేశారు. పడిపోయిన కొండచరియలను JCB సహాయంతో వాటిని తొలగించే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. ప్రయాణికులు గమనించి తమకు సహకరించాలని అధికారులు కోరారు.
Similar News
News February 4, 2026
ప్రకాశం: చిట్టీల పేరుతో రూ.10 కోట్లు తీసుకొని పరార్..!

సింగరాయకొండలో <<19045967>>చిట్టీల పేరుతో<<>> K. శ్రీను అనే వ్యక్తి సుమారు రూ. 10 కోట్లకు పైగా వసూలు చేసి పరారయ్యాడు. అధిక వడ్డీ ఆశచూపడంతో మహిళలు, రోజువారీ కూలీలు, విశ్రాంత ఉద్యోగులు తమ పొదుపు మొత్తాన్ని అతనికి అప్పగించారు. బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి పోలీసులను ఆశ్రయించడంతో భారీ కుంభకోణం వెలుగుచూసింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
News February 4, 2026
హాస్టల్‌పై నుంచి పడి ఒంగోలు విద్యార్థి మృతి

తిరుపతి జిల్లా చంద్రగిరి(M) రంగంపేటలోని ఓ యూనివర్సిటీలో ఒంగోలుకు చెందిన యువకుడు బీ.టెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. కళాశాల సమీపంలోని ఓ ప్రైవేట్ హాస్టల్‌లో నివాసముంటున్న బాలాజీ బుధవారం తెల్లవారుజామున తాను ఉంటున్న హాస్టల్ భవనం పైనుంచి కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
News February 4, 2026
ఉమ్మడి ప్రకాశం: 10th విద్యార్థులకు అలర్ట్.!

ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఈనెల 9వ తేదీ నుంచి పదవ తరగతి విద్యార్థులకు ప్రీ పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు DEO రేణుక తెలిపారు. 9న తెలుగు, 10-హిందీ, 11-ఇంగ్లిష్, 12-మ్యాథ్స్, 13-ఫిజికల్ సైన్స్, 16-బయోలాజికల్ సైన్స్, 17-సోషల్ స్టడీస్, 18-కాంపోజిట్ కోర్స్ ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2, 19-ఓఎస్‌ఎస్‌సి మెయిన్ లాంగ్వేజ్ పేపర్-2 పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.


