News April 24, 2024
దౌల్తాబాద్: పోక్సో కేసులో పదేళ్ల జైలు
బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ సిద్దిపేట 2వ సెషన్స్ జడ్జీ తీర్పును ఇచ్చారని సీపీ అనురాధ తెలిపారు. దౌల్తాబాద్ మండలం సూరంపల్లికి చెందిన టి.శ్రీకాంత్(20) అక్టోబర్ 19, 2021న ఓ పౌల్ట్రీఫాంలో పనిచేస్తున్న బాలిక(15)ను కిడ్నాప్ చేసి మానభంగానికి పాల్పడ్డారు. ఈ విషయమై విచారణ జరిపిన జడ్జీ నిందితుడికి జైలుశిక్ష విధించారు.
Similar News
News January 5, 2025
మెదక్: బాలికపై సామూహిక అత్యాచారం
మెదక్ జిల్లా మసాయిపేట మండలంలోని ఓ గిరిజన తండాలో దారుణం జరిగింది. ఎస్ఐ వివరాల ప్రకారం.. ఓ గ్రామానికి చెందిన బాలిక తల్లిదండ్రులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. దీంతో బాలిక అన్నయ్య, బాబాయ్ వారిని తీసుకుని ఆసుపత్రికి వెళ్లారు. అదునుగా తీసుకున్న ఇద్దరు యువకులు ఇంట్లో ఒంటరిగా ఉన్న 16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దిరపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
News January 5, 2025
తూప్రాన్: మహిళను చంపిన వ్యక్తి అరెస్ట్
ఓ మహిళను నమ్మించి సహజీవనం చేస్తూ చంపిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తూప్రాన్ సీఐ రామకృష్ణ, మనోహరాబాద్ ఎస్ఐ సుభాష్ గౌడ్ తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాలు.. బిహార్‌కు చెందిన సూరజ్ కుమార్ చంద్ర వంశీకి రజిని దేవి అనే మహిళతో పరిచయం ఏర్పడింది. వారు కొన్ని రోజులుగా కలిసే ఉంటున్నారు. ఈక్రమంలో వారి మద్య డబ్బుల విషయంలో తరచూ గొడవ జరగుతుండగా, రజినిని చంపినట్టు ఎస్ఐ తెలిపారు.
News January 5, 2025
సిద్దిపేట: సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలి: మంత్రి పొన్నం
జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలపై గ్రామ గ్రామాన అవగాహన కల్పించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్లతో శనివారం రాష్ట్ర సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లాల్లో ప్రమాదాలు జరిగే ప్రాంతాలను బ్లాక్ స్పాట్లుగా గుర్తించాలన్నారు.