News December 29, 2024
దౌల్తాబాద్: వలకు చిక్కిన కొండ చిలువ
కొడంగల్ నియోజవర్గంలోని దౌల్తాబాద్ పరిధిలో వేట వలలో భారీ కొండ చిలువ చిక్కింది. మండల కేంద్రంలోని దౌల్తాబాద్, రాళ్లపల్లి మధ్యలో ఉన్న అడవి సమీపంలో కొందరు వేటకు వేసిన వలలో కొండ చిలువ చిక్కింది. ఇవాళ ఉదయం వెళ్లిన వేటగాళ్లు వలలో చిక్కిన కొండ చిలువను చూసి భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులు, ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి కొండ చిలువను పట్టుకొని ఫారెస్టు ఆఫీసర్లకు అప్పగించారు.
Similar News
News January 1, 2025
MBNR: నగ్న చిత్రాలు తీసి అత్యాచారం
ఓ మహిళ నగ్న చిత్రాలు తీసి ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన అమానవీయ ఘటన నవాబ్‌పేట మం.లో జరిగింది. SI విక్రమ్ వివరాలు.. ఓ మహిళ స్నానం చేస్తుండగా నర్సింహులు ఫొటోలు తీశాడు. సోషల్ మీడియాలో పెడతానని బెదిరించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. రోజు రోజుకి వేధింపులు పెరగడంతో బాధితురాలు PSలో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News January 1, 2025
పాలమూరు మెడికల్ కళాశాలకు వృద్ధురాలి మృతదేహం
జడ్చర్ల పట్టణంలోని ఓ వృద్ధాశ్రమంలో మృతి చెందిన వృద్ధురాలు గొల్ల భీమమ్మ మృతి చెందింది. ఈ నేపథ్యంలో ఆశ్రమ నిర్వాహకులు చిత్తనూరి రామకృష్ణ మహబూబ్‌నగర్ మెడికల్ కళాశాలకు వృద్ధురాలి మృతదేహాన్ని మంగళవారం అప్పగించారు. ఈ సందర్భంగా ఎంబీబీఎస్ మొదటి సంవత్సర చదువుతున్న విద్యార్థులు మృతదేహానికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ ఛైర్మన్ నటరాజ్ తదితరులు పాల్గొన్నారు.
News January 1, 2025
MBNR: యుజీసీ పరీక్షకు ఏర్పాట్లు పూర్తిచేయాలి: కలెక్టర్
జనవరి 3న MBNRలో నిర్వహించే యుజీసీ నెట్ 2024 పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ విజయేంద్రబోయి ఆదేశించారు. పరీక్షలు నిర్వహించే సెంటర్‌ను మంగళవారం ఆమె పరిశీలించి మాట్లాడారు. పరీక్షలకు 185 మంది అభ్యర్థులు హాజరు కానున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద శాంతి భద్రతల నిర్వహణ, నిరంతర విద్యుత్, ఫస్ట్ ఎయిడ్ కిట్ తదితర సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు.