News February 13, 2025

‘ద్రౌపది దాహం తీర్చుకున్న ప్రదేశమే భీముని కొలను’

image

పూర్వం పాండవులు శ్రీశైలం నల్లమల అడవుల్లో తీర్థయాత్రలు చేస్తూ ద్రౌపది దాహం తీర్చుకున్న కొలనే భీముని కొలనుగా ప్రసిద్ధి చెందింది. ద్రౌపది దాహంగా ఉందని చెప్పడంతో భీముడు చుట్టుపక్కల వెతికాడు. ఎక్కడా నీళ్లు దొరకలేదు. దాలోమశ మహర్షి ఒక శిలను చూపించి, పగులగొట్టమని చెప్పాడు. గదతో ఆ శిలను భీముడు పగులగొట్టగా నీటి ధారలు కిందికి దూకాయి. భీముని కారణంగా ఏర్పడిన కొలను కావడంతో ‘భీముని కొలను‘ అనే పేరు వచ్చింది.

Similar News

News February 13, 2025

తాడిపత్రిలో శివలింగం కింద నీటిని చూశారా!

image

అనంతపురం జిల్లాలో దక్షిణ కాశీగా పిలవబడుతూ తాడిపత్రిలోని పెన్నా నది ఒడ్డున వెలసిన శ్రీ బుగ్గ రామలింగేశ్వరస్వామి క్షేత్రానికి ఓ విశిష్టత ఉంది. వర్షాలు లేకపోయినా, నీటి వనరులు ఎండిపోయినా ఇక్కడ శివలింగం కింద నీరు ఊరుతూనే ఉంటుంది. అయితే అలంకరణలో ఉన్న సమయంలో దర్శనానికి వెళ్లే భక్తులకు ఆ దృశ్యాన్ని చూసే భాగ్యం కలగదు. పై ఫొటోలో శివలింగం కింద నీటిని స్పష్టంగా చూడొచ్చు.

News February 13, 2025

కొత్తగూడెంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

image

భద్రాద్రి కొత్తగూడెంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. 30 నుంచి 35 డీగ్రీల వరకు నమోదువుతున్నాయి. రాత్రి పూట చలికి.. పగటిపూట ఎండకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందడానికి పండ్ల రసాలు, కొబ్బరి బొండాల వైపు మొగ్గు చూపడంతో వాటి ధరలు గణనీయంగా పెరిగిపోతున్నాయి. మధ్యాహ్న సమయంలో ఎండ తీవ్రత వల్ల ప్రజలు రోడ్లపైకి రాకపోవడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి.

News February 13, 2025

ప్రకాశం జిల్లా రైతులకు ముఖ్య సూచనలు

image

ప్రకాశం జిల్లాలోని రైతులు తమ భూముల వివరాలను ఈనెల 25వ తేదీలోగా ఆన్‌లైన్లో రిజిస్టర్ చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టాదారు పాస్ పుస్తకం, ఫోన్ నంబర్ లింక్ అయి ఉన్న ఆధార్ కార్డుతో సచివాలయం రైతు సేవా కేంద్రాలకు వెళితే అగ్రికల్చర్ అసిస్టెంట్ రిజిస్టర్ చేస్తారని తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

error: Content is protected !!