News December 9, 2025

‘ద్వార లక్ష్మీ పూజ’ ఎలా చేయాలి?

image

ఉదయాన్నే లేచి గడపను శుభ్రం చేసుకొని పసుపు, కుంకుమ, పువ్వులతో అలంకరించాలి. 3 వత్తుల దీపం, బెల్లం, అటుకులు, తాంబూలం నైవేద్యంగా పెట్టాలి. గణేషుడిని నమస్కరించి సంకల్పం చెప్పుకోవాలి. వేంకటేశ్వర స్వామి, లక్ష్మీ అష్టోత్తరాలు చదివి హారతి ఇవ్వాలి. దీపం కొండెక్కే వరకు ఉంచి, తర్వాత తొలగించాలి. పూజ పూర్తయ్యాక నిద్రపోవడం శుభకరం కాదు. పెళ్లికానివారు, ఇంటి, ఉద్యోగ సమస్యలు ఉన్నవారు ఈ పూజ చేయవచ్చు.

Similar News

News April 15, 2026

ఏప్రిల్ 15: చరిత్రలో ఈ రోజు

image

*1452: బహుముఖ ప్రజ్ఞాశాలి లియొనార్డో డావిన్సి జయంతి(ఫొటోలో)
*1469: భారత ఆధ్యాత్మిక గురువు గురునానక్ జయంతి
*1865: అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ మరణం
*1912: టైటానిక్ షిప్ మునిగిపోయిన రోజు
*1977: భారత సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ జననం
*ప్రపంచ కళా దినోత్సవం
*సాంస్కృతిక సార్వత్రిక దినోత్సవం

News April 15, 2026

పవన్‌తో తోట చంద్రశేఖర్ భేటీ.. మళ్లీ జనసేనలోకి?

image

AP: జనసేన అధినేత, DyCM పవన్ కళ్యాణ్‌ను తోట చంద్రశేఖర్ కలిశారు. మంగళగరిలోని జనసేన ఆఫీసులో భేటీ అయ్యారు. చంద్రశేఖర్ 2019లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. మూడేళ్ల కిందట BRS పార్టీలో చేరారు. AP BRS అధ్యక్షుడిగా పని చేశారు. కానీ చాలా రోజులుగా ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. పవన్‌ను కలవడంతో ఆయన మళ్లీ జనసేనలోకి చేరుతారనే చర్చ జరుగుతోంది.