News March 30, 2025
ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలి: కలెక్టర్

జిల్లాలో బైక్ రైడర్లు తప్పకుండా హెల్మెట్ వాడేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు అధికారులను శనివారం ఆదేశించారు. జిల్లాలో ఆశించిన స్థాయిలో బైక్ రైడర్లు హెల్మెట్ వినియోగించకపోవడం ఆందోళన కరమన్నారు. స్థానిక కలెక్టరేట్‌లో ఎస్సార్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో జిల్లా కలెక్టర్ గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
Similar News
News September 20, 2025
పాడేరు: 10 వేల హెక్టార్లలో రాజ్ మా సాగు

పాడేరు జిల్లాలో ఈ ఏడాది 10 వేల హెక్టార్లలో రాజ్ మా పంట సాగవుతోంది. ఇందుకు అవసరమైన రాజ్ మా విత్తనాలను ప్రతి మండలానికి అందజేసినట్లు జిల్లా వ్యసాయ అధికారి SBN నంద్ తెలిపారు. ఇప్పటి వరకు రైతులకు 4,900 క్వింటాళ్ళ విత్తనాలను సబ్సిడీ ధరకు అందజేశామన్నారు. గత ఏడాది 4,500 క్వింటాళ్ళ విత్తనాలు సరఫరా చేయగా 9వేల హెక్టార్లలో ఈ పంట సాగయ్యిందన్నారు. రాజ్ మా సాగులో విత్తన శుద్ధి తప్పనిసరి అన్నారు.
News September 20, 2025
మాచర్లకు చేరుకున్న సీఎం చంద్రబాబు

సీఎం చంద్రబాబు మాచర్లకు చేరుకున్నారు. స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆయన యాదవ బజార్‌లో ఉన్న చెరువు వద్ద పారిశుద్ధ్య కార్మికులతో కలిసి చెత్తను ఊడ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు, పార్టీ నేతలు భారీ ఎత్తున పాల్గొన్నారు.
News September 20, 2025
ఒంగోలు రైల్వే స్టేషన్లో గంజాయి పట్టివేత

ఒంగోలు రైల్వే స్టేషన్ వద్ద శనివారం ఈగల్ టీం తనిఖీలు నిర్వహించింది. హౌరా నుంచి బెంగళూరు వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలులో అబ్దుల్ హుదూద్ వద్ద 1.5 కిలోల గంజాయిని గుర్తించారు. మరో 38 చిన్న గంజా ప్యాకెట్లు దొరికాయి. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని GRP పోలీసులకు అప్పగించారు.