News September 26, 2025

ధనలక్ష్మి అవతారంలో బోయకొండ గంగమ్మ

image

పుణ్యక్షేత్రమైన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో నిర్వహిస్తున్న దసరా మహోత్సవాలను పురస్కరించుకొని శుక్రవారం అమ్మవారిని ధనలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆలయ ఉప కమిషనర్ ఏకాంబరం పర్యవేక్షణలో అమ్మవారిని అత్యంత సుందరంగా అలంకరణ చేసి భక్తులకు దర్శనం కల్పించారు. అనంతరం పవిత్ర తీర్థప్రసాదాలను అందజేసి వేద పండితులచే ఆశీర్వచనం కల్పించారు. వివిధ ప్రాంతాల అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

Similar News

News September 26, 2025

రాజంపేట MP మిథున్ రెడ్డికి బెయిల్ వచ్చేనా?

image

రాజంపేట MP మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. ఈనెల 29న తీర్పు వెల్లడిస్తామని ACB కోర్టు పేర్కొంది. ‘లిక్కర్ స్కాంలో మిథున్ రెడ్డి కింగ్ పిన్. ఆయన కంపెనీల్లో రూ.5కోట్ల ట్రాన్సాక్షన్లపై అనుమానం ఉంది. బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారు’ అని AG దమ్మాలపాటి శ్రీనివాసులు వాదించారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా MPపై కేసు పెట్టారని ఆయన తరఫు లాయర్ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు.

News September 26, 2025

పుంగనూరు: ఆలరించిన డాన్స్ ప్రోగ్రామ్స్

image

పుంగనూరు మండలంలోని చదల్లలో సప్త మాతృక సమేత చౌడేశ్వరి దేవి ఆలయంలో దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం రాత్రి ఢీ డాన్స్ ప్రోగ్రాం ఆర్టిస్ట్ పండు ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు. ఇవి అందరిని అలరించాయి. పెద్ద సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు.

News September 25, 2025

చిత్తూరు: ఎన్నిరకాల గ్రానైట్ రాళ్లు లభ్యమవుతాయో తెలుసా!

image

చిత్తూరు, పూతలపట్టు, నగరి, జీడీ నెల్లూరులో దాదాపు 400 క్వారీల్లో <<17827190>>గ్రానైట్ తవ్వకాలు<<>> సాగుతున్నాయి. చీటా బ్రౌన్, సి-గ్రీన్, మల్టీ రెడ్‌లతో పాటు అత్యంత ఖరీదైన బ్లాక్ గ్రానైట్ జీ-20 రకం జిల్లాలో లభ్యమవుతుంది. ఇక్కడ దొరికే గ్రానైట్ ఏపీలోనే కాకుండా సౌత్ లో మంచి డిమాండ్ ఉంది. చిత్తూరు నుంచి చెన్నై, తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగాతోపాటు బెంగళూరు, కేరళకు సైతం సరఫరాచేస్తారు.