News December 23, 2025
ధనుర్మాసం: ఎనిమిదో రోజు కీర్తన

‘తూర్పున తెలవారింది. గేదెలు మేతకు వెళ్లాయి. కృష్ణుడిని చేరుకోవాలని గోపికలంతా ఓచోట చేరి, నిద్రపోతున్న నిన్ను మేల్కొల్పుతున్నారు. కేశి అనే అసురుణ్ణి, చాణూర ముష్టికులను అంతం చేసిన వీరుడి సన్నిధికి అందరం కలిసి వెళ్దాం పద! మనకంటే ముందే ఆయన వస్తే బాగుండదు. మనమే ముందెళ్లి ఎదురుచూస్తే ఆయన సంతోషంతో మన కోరికలను వెంటనే నెరవేరుస్తారు. ఆలస్యం చేయక లే, కృష్ణ పరమాత్మను కొలిచి నోము ఫలాన్ని పొందుదాం’.<<-se>>#DHANURMASAM<<>>
Similar News
News December 23, 2025
చలికాలంలో వెచ్చని ప్రదేశాలకు టూర్!

వింటర్ ట్రావెల్‌కు పర్ఫెక్ట్ డెస్టినేషన్ గోవా. సూర్యుని వెచ్చదనంతో ఆకర్షణీయమైన బీచ్‌లతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అండమాన్ దీవులు, రాజస్థాన్‌లోని జైసల్మేర్, అలెప్పీ(కేరళ బ్యాక్‌వాటర్స్), గుజరాత్‌లోని రణ్ ఆఫ్ కచ్, పుదుచ్చేరి, కర్ణాటకలోని హంపి, బెంగాల్‌లోని మందార్‌మణి, కేరళలోని వర్కల, తమిళనాడులోని కన్యాకుమారి వింటర్‌లో పర్యటించేందుకు అనుకూలం. DEC-FEB వరకు ఈ ప్రాంతాల్లో 25-30 డిగ్రీల టెంపరేచర్లు ఉంటాయి.
News December 23, 2025
శరీరానికే వైకల్యం.. సంకల్పానికి కాదు: IESలో మానవేంద్ర వండర్!

శారీరక వైకల్యం అడ్డువచ్చినా, పట్టుదలతో భారతీయ ఇంజినీరింగ్ సర్వీసెస్ (IES) పరీక్షలో 112వ ర్యాంక్ సాధించారు మానవేంద్ర సింగ్. తండ్రి చనిపోయినా, తల్లి రేణు సింగ్ ఇచ్చిన ధైర్యంతో ఈ విజయం అందుకున్నారు UPలోని బులంద్‌షహర్‌కు చెందిన ఈ కుర్రాడు. పట్నాలో బీటెక్ చేస్తుండగానే IES ఆఫీసర్ కావాలని కలలు కన్నారు. ఇప్పుడు అది నిజం కావటంతో కుటుంబ సభ్యులు, ఊరి జనం మానవేంద్రను అభినందనలతో ముంచెత్తుతున్నారు.
News December 23, 2025
మెస్సీ సోదరికి యాక్సిడెంట్.. తీవ్ర గాయాలు

అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ మెస్సీ సోదరి మారియా సోల్ మియామిలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి గోడను ఢీకొట్టింది. దీంతో ఆమె శరీరంలో కొంతభాగం కాలిపోవడంతో పాటు వెన్నెముక, మడమ, మణికట్టు వద్ద ఫ్రాక్చర్ అయినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. జనవరి 3న జరగాల్సిన ఆమె పెళ్లి కూడా వాయిదా పడింది. మెస్సీ ఇటీవల భారత్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే.


