News December 25, 2025
ధనుర్మాసం: పదో రోజు కీర్తన

యోగనిద్రలో ఉన్న ఐదో గోపికను ఇతర గోపికలు ఇలా మేల్కొల్పుతున్నారు. ‘ఓ అమ్మా! తలుపు తీయకపోయినా పర్వాలేదు. కనీసం మా మాటలకు సమాధానమైనా ఇవ్వు. జ్ఞానుల మాటలు వినడం ఎంతో పుణ్యం. పరిమళభరిత తులసిమాలలు ధరించే నారాయణుడు మన వ్రతానికి ఫలితాన్నిస్తాడు. రాముడి చేతిలో హతుడైన కుంభకర్ణుడు తన నిద్రను నీకేమైనా ఇచ్చాడా? ఆలస్యం చేయక నిద్ర వీడి, మాతో కలిసి వ్రతాన్ని పూర్తి చేయి’ అని వేడుకుంటున్నారు. <<-se>>#DHANURMASAM<<>>
Similar News
News December 25, 2025
రేవంత్ పేరెత్తని కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా?

TG: KCR ఇటీవల రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శల దాడికి దిగుతూ సుదీర్ఘంగా మాట్లాడారు. తన ప్రసంగంలో ఒక్కసారి కూడా సీఎం రేవంత్ పేరు ఎత్తలేదు. అలాంటిది అసెంబ్లీలో CM ఎదుట ప్రతిపక్ష నేతగా కూర్చోవడానికి ఇష్టపడతారా? అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు KCR అసెంబ్లీకి వెళ్లి పాలమూరు-రంగారెడ్డిపై ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టనున్నారనే టాక్ BRS పార్టీలో విన్పిస్తోంది. దీనిపై క్లారిటీ కోసం <<18664624>>29వ తేదీ<<>> వరకు వేచి చూడాల్సిందే.
News December 25, 2025
NCERT 173 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

<
News December 25, 2025
తిరుమల క్షేత్రపాలుడిగా పరమశివుడు

తిరుమల కేవలం వైష్ణవ క్షేత్రమే కాదు. శైవ సామరస్యానికి వేదిక కూడా! శ్రీవారు ఇక్కడ కొలువై ఉంటే, ఆయనకు రక్షకుడిగా, క్షేత్రపాలుడిగా పరమశివుడు ‘రుద్రుడి’ రూపంలో కొలువై ఉంటారు. తిరుమల కొండపై ఉన్న ‘గోగర్భ తీర్థం’ వద్ద శివుడు క్షేత్రపాలకత్వ బాధ్యతలు నిర్వహిస్తారట. శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు క్షేత్రపాలుడిని కూడా స్మరించుకోవడం ఆచారంగా వస్తోంది. హరిహరుల మధ్య భేదం లేదని ఈ క్షేత్రం చాటిచెబుతోంది.


