News September 28, 2025
ధన్, ధాన్య కృషి యోజనలో అనంతపురం జిల్లా ఎంపిక

PM ధన్, ధాన్య కృషి యోజన కింద దేశంలోని 100 ఆశావహ వ్యవసాయ జిల్లాల్లో అనంతపురం ఎంపికైనట్లు MP అంబికా లక్ష్మీనారాయణ ఆదివారం తెలిపారు. PM మోదీ, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, CM చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలిపారు. అధికారులు పంట ఉత్పాదకత తక్కువగా ఉండడం, తక్షణ రుణాల పంపిణీ పరిమితంగా ఉండడం వంటివి ఆధారంగా తీసుకున్న నిర్ణయం మంచిపరిణామమన్నారు.
Similar News
News September 28, 2025
అనంతపురం జిల్లాలో పింఛన్లకు రూ.124.77 కోట్లు మంజూరు

అక్టోబర్ 1న ఎన్టీఆర్ సామాజిక భద్రత పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. అనంతపురం జిల్లాలో 2,79,933 మంది లబ్ధిదారులకు రూ.124.7 కోట్లు మంజూరు చేశారు. సచివాలయం సిబ్బంది ఉదయం 7 గంటలకు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి సొమ్ము అందజేయనున్నారు. అక్టోబర్ 2 సెలవు కారణంగా మొదటి రోజు పొందని వారు అక్టోబర్ 3న సచివాలయాలలో పెన్షన్ తీసుకోవచ్చని DRDA పీడీ శైలజ తెలిపారు.
News September 28, 2025
‘తాడిపత్రిలో 23 ఏళ్ల తర్వాత ఒక్కటయ్యారు’

తాడిపత్రిలో ఆ మిత్రులందరూ 23 ఏళ్ల తర్వాత ఒకే చోట కలుసుకున్నారు. దాదాపు 30 మంది విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసం అభ్యసించి డాక్టర్లు, జడ్జి, టీచర్స్, ASPలుగా ఉన్నత పదవుల్లో ఉన్నారు. దాదాపు 23 ఏళ్ల తర్వాత తమ గురువులతో కలిసి మిత్రులతో సంతోషంగా గడపడం ఎంతో సంతోషంగా ఉందని కరస్పాండెంట్ సిస్టర్ సెలీన్ పేర్కొన్నారు.
News September 27, 2025
అనంతపురం జిల్లాలో 82.6 మి.మీ వర్షపాతం నమోదు

అనంతపురం జిల్లా వ్యాప్తంగా 82.6 మి.మీ వర్షపాతం నమోదైనట్లు జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి అశోక్ కుమార్ తెలిపారు. విడపనకల్ 11.4, గుత్తి 10.8, ఉరవకొండ 6.8, ఆత్మకూరు 5.4, కనేకల్ 5.2, పెద్దవడుగూరు 5.2, వజ్రకరూరు 5.0, గుంతకల్ 4.2, గార్లదిన్నె 4.2, నార్పల 3.6, BKS 3.2, బొమ్మనహళ్ 2.4, పామిడి 2.4, బెలుగుప్పలో 1.8 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని చెప్పారు.