News April 17, 2025

ధరణి పోర్టల్‌కు భూభారతికి మధ్య చాలా తేడా: కలెక్టర్

image

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన భూభారతి పోర్టల్‌కు గతంలోని ధరణి పోర్టల్‌కు మధ్య చాలా వ్యత్యాసం ఉందని ములుగు కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. బుధవారం భూభారతి పోర్టల్‌పై కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. భూభారతి పోర్టల్‌లో మరో 14 అంశాలను ప్రభుత్వం చేర్చిందన్నారు. గతంలో భూ సమస్యలపై కోర్టులను ఆశ్రయించేవారని, నేడు దాని స్థానంలో షెడ్యూల్ ” ఏ” ఉందన్నారు.

Similar News

News April 25, 2025

MBNR: కాంగ్రెస్ ప్రభుత్వంలో వ్యవస్థలు కుదేలు: శ్రీనివాస్ గౌడ్

image

మహబూబ్‌నగర్‌లోని న్యూటౌన్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ సన్నాహక సమావేశం ఈరోజు జరిగింది. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. అన్ని సంక్షేమ పథకాల అమలు చేయడంతో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. గ్రామ స్థాయి నుంచి కార్యకర్తలందరూ బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసి కార్యకర్తలకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. చలో వరంగల్ సభను విజయవంతం చేయాలన్నారు. ఎమ్మెల్సీ, నాయకులు పాల్గొన్నారు.

News April 25, 2025

పాకిస్థానీయులను వెనక్కి పంపండి.. షా ఆదేశాలు

image

పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పాక్ దేశస్థులను గుర్తించి వెనక్కి పంపాలని ఆదేశించారు. ఈ విషయమై ఆయా రాష్ట్రాల సీఎంలకు ఫోన్ చేశారు. ఇప్పటికే పాకిస్థానీయుల వీసాలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. కాగా హైదరాబాద్‌లో 200 మందికి పైగా పాకిస్థానీయులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో హైఅలర్ట్ ప్రకటించి, వారిని వెనక్కి పంపేందుకు చర్యలు చేేపట్టారు.

News April 25, 2025

ఆర్మీ కంటపడ్డాడు.. ఖతమయ్యాడు

image

లష్కరే తోయిబా టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లీని భారత సైన్యం <<16209767>>మట్టుబెట్టిన<<>> విషయం తెలిసిందే. పహల్గామ్ దాడి నిందితుల కోసం ఆర్మీ, J&K పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టగా అల్తాఫ్ వారి కంటపడ్డాడు. దీంతో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఆర్మీ ఫైరింగ్‌లో అల్తాఫ్ హతమయ్యాడు. అటు కశ్మీర్ వ్యాప్తంగా ఉగ్రవాదుల కోసం ముమ్మర గాలింపు కొనసాగుతోంది. ఆర్మీ చీఫ్ ద్వివేది అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

error: Content is protected !!