News July 8, 2025
ధరూర్: జూరాల ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

ఆల్మట్టి నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేయడంతో ధరూర్ మండలం రేవులపల్లి వద్ద ఉన్న జూరాల ప్రాజెక్టుకు మంగళవారం సాయంత్రం ఇన్ ఫ్లో 1.25 లక్షల క్యూసెక్కులు వస్తుండగా 14 గేట్లు ఓపెన్ చేసి 94,962 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. పవర్ హౌస్‌కు 29,053, ఎడమ కాల్వకు 770, కుడి కాల్వకు 400 క్యూసెక్కులు మొత్తం 1,26,844 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
Similar News
News July 9, 2025
ఇక సెలవు.. శివశక్తి దత్తా అంత్యక్రియలు పూర్తి

ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తండ్రి శివశక్తి దత్తా(92) అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. మంగళవారం సాయంత్రం హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లోని మహాప్రస్థానంలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కుటుంబ సభ్యులు ఆయనకు కన్నీటి వీడ్కోలు పలికారు. <<16987487>>శివశక్తి దత్తా<<>> వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే.
News July 9, 2025
BRSకు మళ్లీ అదే పరిస్థితి వస్తుంది: భట్టి

TG: ప్రజలకు ఏం చేశామనే దానిపై అసెంబ్లీలో చర్చిద్దామని CM రేవంత్ సవాల్ విసిరితే, BRS నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని Dy.CM భట్టి విక్రమార్క మండిపడ్డారు. ఇలా మాట్లాడినందుకే BRSకు గత ఎన్నికల్లో ఓటమి ఎదురైందని, ఆ పార్టీ నేతలు తీరు మార్చుకోకుంటే మళ్లీ అదే పరిస్థితి తప్పదని హెచ్చరించారు. రైతుల ఖాతాల్లో 9 రోజుల్లో రూ.9వేల కోట్లు జమ, రూ.21వేల కోట్లు రుణమాఫీ చేయడం అన్యాయం చేసినట్లా? అని నిలదీశారు.
News July 9, 2025
కోహ్లీకి థాంక్స్ చెప్పిన జకోవిచ్

టెన్నిస్ దిగ్గజం జకోవిచ్ వింబుల్డన్ మ్యాచ్‌ను స్టార్ క్రికెటర్ కోహ్లీ, అనుష్క దంపతులు లైవ్‌లో వీక్షించారు. ‘వాట్ ఏ మ్యాచ్. గ్లాడియేటర్‌కు ఇది అలవాటైన పనే’ అని కోహ్లీ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. దీనికి ‘థాంక్యూ ఫర్ సపోర్టింగ్’ అని జకోవిచ్ బదులిచ్చారు. తాము తరచూ ఫోన్లో మెసేజ్‌లు చేసుకుంటామని గతంలో వీరిద్దరూ చెప్పిన విషయం తెలిసిందే. అటు క్రికెట్ కంటే టెన్నిస్‌లోనే ఒత్తిడి ఎక్కువని కోహ్లీ అన్నారు.