News April 16, 2025
ధరూర్ తహశీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్

ప్రజలకు అందుబాటులో ఉండి, వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ సంతోష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ధరూర్ మండల తహశీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్, రెవెన్యూ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో పరిశీలించి, సంబంధిత అధికారులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. కుల, ఆదాయ, ఓబీసీ, రెసిడెన్స్ సర్టిఫికెట్లు జారీ కోసం వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు.
Similar News
News November 9, 2025
సంగారెడ్డి: శ్రీశైలం పుణ్యక్షేత్రానికి ప్రత్యేక బస్సులు

కార్తీక మాసాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి ఆర్టీసీ డిపో నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ ఉపేందర్ తెలిపారు. నేటి నుంచి మొత్తం 4 సూపర్ లగ్జరీ బస్సు సర్వీసులను నడపనున్నట్లు ఆయన వివరించారు. ఈ బస్సులు ఉదయం 4:10, 5:50 గంటలకు, మధ్యాహ్నం 1, 2 గంటలకు డిపో నుంచి బయలుదేరుతాయని తెలిపారు. భక్తులు ఈ ప్రత్యేక సదుపాయాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.
News November 9, 2025
ఆముదం పంటలో దాసరి పురుగు నివారణ ఎలా?

దాసరి పురుగు ఆముదం పంటను జనవరి మాసం వరకు ఆశిస్తుంది. ఈ పురుగు పంటపై ఆశించిన తొలిదశలో ఆకులను గోకి తర్వాత రంధ్రాలు చేసి ఆకులన్నీ తింటాయి. పురుగు ఉద్ధృతి ఎక్కువగా ఉన్నప్పుడు లేత కొమ్మలను, కాడలను, పెరిగే కాయలను తిని పంటకు తీవ్ర నష్టాన్ని కలగజేస్తాయి. దాసరి పురుగుల నివారణకు లీటరు నీటికి ఎసిఫేట్ 1.5 గ్రా. లేదా థయోడికార్బ్ 1.5 గ్రా. లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 0.3 మి.లీ కలిపి పంటపై పిచికారీ చేయాలి.
News November 9, 2025
రూ.2 వేలు కడితే.. రూ.18,500 ఇస్తామని మెసేజ్‌లు

అమాయకులను లక్ష్యంగా చేసుకొని వాట్సాప్‌లో కేటుగాళ్లు కొత్త మోసాలకు పాల్పడుతున్నారు. రూ.2వేలు కట్టండి, రూ.18,500 జమ చేస్తాం అనే ఆఫర్‌తో మహిళలు, విద్యార్థులను గ్రూపుల్లో యాడ్ చేసి ఎర వేస్తున్నారు. చెల్లింపుల స్క్రీన్‌షాట్లు, పోలీసుల్లా మెసేజ్‌లు పెట్టి నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మోసాలపై సైబర్ పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ వ్యక్తమవుతోంది.


