News April 4, 2025
ధరూర్ నూతన పోలీస్ స్టేషన్‌కు డీజీపీ భూమి పూజ

ధరూర్ మండల కేంద్రంలో రూ.2.65 కోట్ల వ్యయంతో నిర్మాణం చేపట్టే నూతన పోలీస్ స్టేషన్‌కు తెలంగాణ డీజీపీ జితేందర్ ఈరోజు శంకుస్థాపన చేశారు. ధరూర్ మండలానికి ఇప్పటికే జూరాల దగ్గర పోలీస్ స్టేషన్ ఉన్నప్పటికీ నూతన పోలీస్ స్టేషన్ నిర్మాణానికి ఈరోజు భూమి పూజ చేశారు. ఆయన వెంట గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఎస్పీ శ్రీనివాస్, డీఎస్పీ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News April 11, 2025
వికారాబాద్: ‘నాణ్యమైన ఉత్పత్తులే విక్రయించాలి’

నాణ్యమైన, స్వచ్ఛమైన పాలతో తయారు చేసిన ఉత్పత్తులను మాత్రమే విక్రయించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. శుక్రవారం వికారాబాద్ కలెక్టరేట్‌లోని ఆవరణలో విజయ తెలంగాణ పాల ఉత్పత్తి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే విజయ డెయిరీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. విజయ విజయ డెయిరీ కేంద్రంలో నాణ్యమైన ఉత్పత్తులను మాత్రమే విక్రయించాలని యాజమాన్యానికి కలెక్టర్ చూసించారు.
News April 11, 2025
జాతీయ స్థాయిలో అన్నామలై సేవలు: అమిత్‌షా

తమిళనాడు బీజేపీ చీఫ్ పదవి కోసం ఒకే నామినేషన్ దాఖలైనట్లు కేంద్ర మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. అన్నామలై సేవలను జాతీయ స్థాయిలో వినియోగించుకుంటామని తెలిపారు. ప్రధాని మోదీ విధానాలను గ్రామీణ స్థాయిలో తీసుకెళ్లడంలో అన్నామలై భాగస్వామ్యం విలువైనవని పేర్కొన్నారు. కాగా ఒకే నామినేషన్ దాఖలు కావడంతో రేపు నైనార్ నాగేంద్రన్‌ను అధ్యక్షుడిగా ప్రకటించే అవకాశముంది.
News April 11, 2025
జమ్మికుంట: క్వింటా పత్తి ధర రూ.7,650

జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌లో పత్తి ధర ఈరోజు కూడా పెరిగింది. గురువారం క్వింటా పత్తి ధర రూ.7,600 పలకగా.. ఈరోజు ₹50 పెరిగి రూ.7,650 పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. శుక్రవారం యార్డుకు రైతులు 193 క్వింటాళ్ల విడిపత్తి విక్రయానికి తీసుకురాగా.. గరిష్ఠంగా రూ.7,650, కనిష్ఠంగా రూ.7,300 ధర పలికింది. గోనె సంచుల్లో 13 క్వింటాలు తీసుకురాగా.. రూ.5,800 నుంచి రూ.6,400 వరకు పలికింది.