News February 27, 2025
ధర్పల్లి: చెరువులో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

ధర్పల్లి మండలంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమవడం కలకలం రేపింది. SI రామకృష్ణ వివరాలిలా.. ధర్పల్లిలోని చెరువులో గురువారం ఉదయం స్థానికులు ఓ మృతదేహాన్ని గమనించి, పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు 35- 40 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తిగా గుర్తించామని, ఎవరైనా శవాన్ని గుర్తుపడితే పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని SI వెల్లడించారు.
Similar News
News February 27, 2025
UPDATE: 2 గంటల వరకు పోలింగ్ శాతం ఎంతంటే?

టీచర్, గ్రాడ్యుయేట్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లాలో మధ్యాహ్నం 2 గంటల వరకు పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి 49.93 శాతం, ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి 66.22 శాతం పోలింగ్ నమోదయ్యిందని అధికారులు తెలిపారు. కాగా పోలింగ్ జరుగుతున్న సరళిని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలిస్తూ పలు సూచనలు చేశారు.
News February 27, 2025
NZB: 17న మిస్సింగ్ 26న మృతదేహం లభ్యం

ఈ నెల 17 నుంచి అదృశ్యమైన వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు NZB 4వ టౌన్ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. ఎస్ఐ వివరాలు.. NZB కోటగల్లీకి చెందిన కారు డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డి(48) ఈ నెల డ్రైవింగ్‌పై కుంభమేళాకు వెళ్లి 17న తిరిగి వచ్చాడు. అప్పటి నుంచి ఇంటికి వెళ్లకుండా కనిపించలేదని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. అయితే ఆయన మృతదేహం నవీపేట్ గాంధీనగర్ శివారులో లభ్యమైనట్లు ఎస్ఐ వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు.
News February 27, 2025
భీమ్‌గల్: సాంబార్‌లో పడి చిన్నారి మృతి

వేడి సాంబార్‌లో చిన్నారి పడి మృతి చెందిన విషాద ఘటన భీమ్‌గల్‌లో చోటు చేసుకుంది. ఎస్ఐ మహేశ్ ప్రకారం.. భీమ్‌గల్‌కి చెందిన కర్నె చార్వీక్(3) తన తల్లి నిహరికతో ఈ నెల 19న ముచ్కూర్‌లోని బంధువుల శుభకార్యానికి వెళ్లాడు. అక్కడ ఆడుకుంటూ ప్రమాదవశాత్తు వేడి సాంబార్ పాత్రలో పడిపోయాడు. శరీరమంతా కాలిపోగా చిన్నారిని చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించారు. బుధవారం చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్ఐ వివరించారు.