News March 17, 2025
ధర్పల్లి: మల్లయ్యను చంపిన భార్య, కొడుకు

ధర్పల్లి (M) హోన్నాజిపేట్లో మల్లయ్య హత్యకు గురయ్యాడు. పోలీసులు, స్థానికుల వివరాలు.. గ్రామానికి చెందిన మల్లయ్యకు కొన్నెళ్లుగా భార్యతో, కొడుకుతో డబ్బుల విషయంలో గొడవలు జరుగుతున్నాయి. శనివారం సాయంత్రం తండ్రీకొడుకులు గొడవపడగా విషయాన్ని తల్లికి చెప్పాడు. దీంతో తల్లీకొడుకులు మల్లయ్యతో గొడవపడి కొందకు పడేసి, బీరుసీసాతో తలపై కొట్టి చంపేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
Similar News
News November 16, 2025
గతంలో ఇచ్చిన స్లిప్పులు తీసుకురావాలి: కలెక్టర్

కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. అన్ని శాఖల అధికారులు కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన అర్జీలు, గతంలో ఇచ్చిన స్లిప్పులు తీసుకురావాలని సూచించారు. సమస్య పరిష్కరించిన తర్వాత SMS ద్వారా సమాచారం చేరవేస్తామని తెలిపారు.
News November 16, 2025
‘గీత కార్మికుల హామీలు నెరవేర్చాలి’

కల్లు గీత కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. సంగారెడ్డిలోని అంబేద్కర్ భవన్‌లో ఆదివారం జరిగిన జిల్లా మహాసభలో మాట్లాడారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 28న సూర్యాపేటలో రణభేరిని నిర్వహిస్తున్నట్లు వెంకటేశ్వర్లు తెలిపారు.
News November 16, 2025
మీకోసంను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ కోరారు. సోమవారం కలెక్టరేట్‌లో మీకోసం కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించడం జరుగుతుందన్నారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో అందజేస్తే తగు విచారణ జరిపి పరిష్కరిస్తామన్నారు.


