News January 29, 2025

ధర్పల్లి: మిషన్ భగీరథ ఏఈఈ ఆత్మహత్య

image

ధర్పల్లిలో మిషన్ భగీరథ AEEగా విధులు నిర్వహిస్తున్న సాయి చరణ్(25) డిచ్‌పల్లి మండలం నడిపల్లి శివారులో పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్‌కు చెందిన ఆయన మూడు నెలల కిందట మొదటి పోస్టింగ్‌లో ధర్పల్లిలో విధుల్లో చేరారు. NZB సుభాష్ నగర్‌లో ఉంటున్నారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.

Similar News

News February 25, 2026

నిజామాబాద్: ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం

image

జిల్లాలో నేటి నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 36,963 మంది విద్యార్థుల కోసం 58 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు జరుగుతాయని, 9:05 వరకు మాత్రమే అనుమతిస్తామని డీఐఈవో తెలిపారు. మాస్ కాపీయింగ్ నివారణకు 3 ఫ్లయింగ్, 8 సిట్టింగ్ స్క్వాడ్లను నియమించారు. పరీక్షా కేంద్రాల వద్ద 163 సెక్షన్ అమలులో ఉంటుంది.

News February 25, 2026

నిజామాబాద్: పదో తరగతి పరీక్షా కేంద్రాల్లో సెల్‌ ఫోన్లు నిషేదం

image

మార్చి 14 నుంచి జరిగే పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు, సిబ్బంది ఎవరూ సెల్‌ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు తీసుకురావద్దని స్పష్టం చేశారు. ప్రశ్నపత్రాల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.