News March 16, 2025
ధర్పల్లి: హోన్నాజీపేట్‌లో బీర్ సీసాతో కొట్టి చంపారు..!

ధర్పల్లి మండలం హోన్నాజిపేట్ గ్రామంలో పాలెం నడిపి మల్లయ్య (55) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడిని భార్య, కొడుకు కలిసి శనివారం రాత్రి చంపేశారని అనుమానిస్తున్నారు. మల్లయ్య తలపై కొడుకు మధు బీరు సీసాతో దాడి చేసి గొంతు నులిమి హత్య చేయగా అందుకు మల్లయ్య భార్య లక్ష్మి సహకరించినట్లు తెలిసింది. ఈ విషయం ఆదివారం ఉదయం వెలుగు చూసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 16, 2025
NZB: 40 డిగ్రీలకు చేరువలో ఎండ

నిజామాబాద్ నగరంలో ఆదివారం మధ్యాహ్నం ఎండ 40 డిగ్రీలకు చేరువ చేరింది. దానికి తోడు వడ గాలులు కూడా వీస్తున్నాయి. దీనితో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. అత్యవసర పనుల మీద బయటకు వచ్చిన ప్రజలు వేడితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా ఇప్పుడే ఎండలు ఇలా ఉంటే రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందోనని భయపడుతున్నారు. కాగా గత ఏడాది ఇదే రోజు 34 డిగ్రీలుగా ఎండ నమోదైంది.
News March 16, 2025
NZB: GREAT.. గ్రూప్- 2, 3లో సత్తా చాటిన SI

గ్రూప్-3 ఫలితాల్లో NZB <<15733792>>డిచ్పల్లి 7వ బెటాలియన్ రిజర్వుడ్ SI ఓరంగంటి అశోక్ మరోసారి స్టేట్ 14వ ర్యాంకు <<>>సాధించారు. SI స్వస్థలం వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం, లింగాపూర్ గ్రామం. ఇటీవల విడుదలైన గ్రూప్-3 ఫలితాల్లో 320 మార్కులు సాధించి BC(A)తో పాటు, భద్రాద్రి జోన్ టాపర్‌గా నిలిచారు. అలాగే గ్రూప్-2లో సైతం స్టేట్ 57 ర్యాంక్, BC(A)లో ఫస్ట్ ర్యాంకు సాధించారు. గ్రూప్- 2,3లో సత్తా చాటిన SI పై మీ కామెంట్?
News March 16, 2025
పేదవాడి ఫ్రిజ్.. ఆదిలాబాద్ రంజన్లకు భలే గిరాకీ

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గత మూడు రోజుల నుంచి ఎండలు తారస్థాయికి చేరాయి. ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందడానికి చల్లని నీరు కోసం ప్రజలు రంజన్లను భారీగా కొనుగోలు చేస్తున్నారు. పలు కూడళ్లలో అదిలాబాద్, నిర్మల్, రాజస్తాన్ తదితర ప్రాంతాల రంజన్లను బట్టి రూ. 100 – 450 విక్రయిస్తున్నారు. సహజ సిద్ధమైన మట్టితో తయారు చేసిన రంజన్ నీరు ఆరోగ్యానికి మంచిదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.