News March 16, 2025
ధర్పల్లి: హోన్నాజీపేట్‌లో బీర్ సీసాతో కొట్టి చంపారు..!

నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం హోన్నాజిపేట్ గ్రామంలో పాలెం నడిపి మల్లయ్య (55) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడిని భార్య, కొడుకు కలిసి శనివారం రాత్రి చంపేశారని అనుమానిస్తున్నారు. మల్లయ్య తలపై కొడుకు మధు బీరు సీసాతో దాడి చేసి గొంతు నులిమి హత్య చేయగా అందుకు మల్లయ్య భార్య లక్ష్మి సహకరించినట్లు తెలిసింది. ఈ విషయం ఆదివారం ఉదయం వెలుగు చూసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News July 4, 2025
తహశీల్దార్లు మరింత ఫోకస్ చేయాలి: BHPL కలెక్టర్

భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల పరిష్కరానికి తహశీల్దార్లు మరింత ఫోకస్ చేయాలని, షెడ్యూల్ సిద్ధం చేసి నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. శుక్రవారం ఐడీఓసీ హాలులో ఆయన భూ భారతి రెవెన్యూ సదస్సుల దరఖాస్తులు పరిష్కారానికి తీసుకున్న చర్యలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. దరఖాస్తుదారులకు నోటీసులు జారీ చేయాలని ఆయన సూచించారు.
News July 4, 2025
మొగల్తూరు: కారు ఢీకొని రైతు మృతి

పేరుపాలెం నార్త్‌లో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రైతు గుత్తుల పెద్దిరాజు మృతి చెందారు. పేరుపాలెం బీచ్ నుంచి భీమవరం వెళ్తున్న స్విఫ్ట్ డిజైర్ కారు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ సమీపంలో అదుపుతప్పి పంట కాలువలోకి దూసుకెళ్లింది. కాలువ పక్కనే పచ్చగడ్డి కోస్తున్న పెద్దిరాజును కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ఉన్న వారికి ఏమి కాలేదు. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు.
News July 4, 2025
ఒక్క బిడ్డకు జన్మనిస్తే రూ.1.30 లక్షలు!

జనాభా సంక్షోభాన్ని అధిగమించేందుకు చైనా ఓ పథకం ప్రవేశపెట్టనుంది. ఒక్కో బిడ్డను కంటే ఏడాదికి 3,600 యువాన్లు (రూ.43 వేలు) రివార్డు ఇచ్చేందుకు సిద్ధమైంది. మూడేళ్లపాటు ఈ నగదు ప్రోత్సాహాన్ని కొనసాగించనుంది. ఇప్పటికే చైనాలోని మంగోలియా ప్రాంతంలో రెండో బిడ్డను కంటే రూ.6లక్షలు, మూడో బిడ్డను కంటే రూ.12 లక్షలు ఇస్తున్నారు. పెళ్లిళ్ల సంఖ్య తగ్గిపోవడం, ఫలితంగా జననాల రేటు పడిపోతుండటంతో ఈ చర్యలు తీసుకుంటోంది.