News February 23, 2025

ధర్మపురిలో అత్యధికం.. జగిత్యాలలో అత్యల్పం

image

జగిత్యాల జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. శనివారం వెల్గటూర్, గోధూరు, ధర్మపురి, గొల్లపల్లిలో 38.1℃ ఉష్ణోగ్రత నమోదైంది. అల్లిపూర్‌ 38, సిరికొండ, కొల్వాయి 37.8 మేడిపల్లి, మారేడుపల్లి 37.7 అల్లిపూర్, నేరేళ్ల, జైన 37.6 పెగడపల్లి 37.3 మల్యాల, రాయికల్‌ 37.2 రాఘవపేట 36.9 మెట్‌పల్లి 36.8 గుల్లకోట, మల్లాపూర్, సారంగాపూర్, కథలాపూర్ 36.7 మన్నెగూడెం 36.6 కోరుట్ల, జగిత్యాలలో 36.4℃గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

Similar News

News February 21, 2026

గద్వాల: దివ్యాంగుల గ్రీవెన్స్ డేకు 37 దరఖాస్తులు

image

దివ్యాంగుల సమస్యలు పరిష్కరించేందుకు గద్వాల కలెక్టరేట్‌లో శనివారం నిర్వహించిన గ్రీవెన్స్‌లో 37 దరఖాస్తులు వచ్చాయని అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు పేర్కొన్నారు. దివ్యాంగుల సంక్షేమం ప్రభుత్వ లక్ష్యమని, వారి సమస్యలు పరిష్కరించేందుకు జిల్లా యంత్రాంగం కట్టుబడి ఉందన్నారు. ఇకపై ప్రతి నెలలో మూడో శనివారం దివ్యాంగుల గ్రీవెన్స్ డే నిర్వహిస్తామన్నారు. ఈ అవకాశాన్ని దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News February 21, 2026

నేత్రాలు మానవ మనుగడకు జీవనాధారం: ధర్మచరణ్

image

అభయ ఛారిటబుల్ ట్రస్ట్ శనివారం ఉచిత కంటి, దంత వైద్యపరీక్షలు నిర్వహించింది. రెడ్డిపాలెంలోని వేదసీడ్స్ కార్యాలయంలో మెడెక్స్ హాస్పిటల్ సహకారంతో ఈ శిబిరం జరిగింది. డాక్టర్ పొట్లూరి అపర్ణ వైద్యబృందం కంటి, దంత పరీక్షలు చేసి పలు సూచనలు చేశారు. వేదసీడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తులసీ ధర్మచరణ్ మాట్లాడుతూ.. ఆరోగ్యకరమైన నేత్రాలే మానవాళి మనుగడకు జీవనాధారం అని అన్నారు.

News February 21, 2026

రెండో పెళ్లి చేసుకున్న శిఖర్ ధవన్

image

టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధవన్ రెండో వివాహం చేసుకున్నారు. ఐర్లాండ్‌కు చెందిన ప్రేయసి సోఫీ షైన్‌తో ఇవాళ ఏడడుగులు వేశారు. ఈ జంటకు అభిమానులు, తోటి క్రికెటర్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఢిల్లీలో జరిగిన ఈ వేడుకకు బంధువులు, స్నేహితులు హాజరయ్యారు. పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.