News December 23, 2025
ధర్మపురి: అభివృద్ధికి కృషి చేసిన నేతకు గుర్తింపు కరువు

ధర్మపురి నియోజకవర్గంలో కాక వెంకటస్వామి వర్ధంతి వేడుకలు ఎక్కడా కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఆయన జీవించి ఉన్న సమయంలో ధర్మపురి నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకొని అనేక కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వం ఆయన జయంతి,వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని ప్రకటించినప్పటికీ, నేడు ధర్మపురిలో కార్యక్రమాలు జరగకపోవడంపై ఆయన అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News December 23, 2025
సైనికుల సంక్షేమానికి మెప్మా నుంచి రూ.4 లక్షల విరాళం

సైనికుల సంక్షేమానికి శ్రీ సత్యసాయి జిల్లా మెప్మా శాఖ ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాలు రూ.4 లక్షల విరాళాన్ని కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్‌కు అందజేశారు. సోమవారం పుట్టపర్తి కలెక్టరేట్‌లోని PGRS హాలులో మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఏ.పద్మావతి, అర్బన్ జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు విజయలక్ష్మి, జిల్లా సమాఖ్య సెక్రటరీ పద్మావతి, మెప్మా సీఎంఎం కలిసి సైనికుల సంక్షేమ నిధికి సంబంధించిన చెక్కును అందజేశారు.
News December 23, 2025
సంక్రాంతి బరిలో ముందుకొచ్చిన మూవీ!

ఈ సంక్రాంతికి థియేటర్ల వద్ద సందడి చేయడానికి సినిమాలు క్యూ కట్టాయి. కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్, శ్రీలీల నటించిన ‘పరాశక్తి’ సైతం అదృష్టం పరీక్షించుకోనుంది. అయితే రిలీజ్ డేట్‌పై మేకర్స్ ట్విస్ట్ ఇచ్చారు. తొలుత JAN 14 అని చెప్పి తాజాగా JAN 10నే వస్తున్నట్లు ప్రకటించారు. రాజాసాబ్, మన శంకరవరప్రసాద్ గారు, భర్త మహాశయులకు విజ్ఞప్తి తదితర తెలుగు చిత్రాల మధ్య ఈ మూవీకి థియేటర్లు దొరుకుతాయో లేదో చూడాలి.
News December 23, 2025
రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్‌ను అభివృద్ధి చేయాలి: కలెక్టర్

ఒంగోలు రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకును అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజాబాబు అధికారులను ఆదేశించారు. సోమవారం ఒంగోలు కలెక్టరేట్‌లోని ఆయన ఛాంబర్‌లో రెడ్ క్రాస్ సంస్థను అభివృద్ధి చేయడానికి తీసుకోవలసిన చర్యలపై కమిటీ సభ్యులు, అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంకుల్లో బ్లడ్‌కు కొదువ లేకుండా చూడాలన్నారు.


