News April 8, 2025

ధర్మపురి: గోదావరిలో దూకి వ్యక్తి ఆత్మహత్య

image

ధర్మపురి మండలంలోని రాయపట్నం గోదావరిలో దూకి హషాం అహ్మద్(45) ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై ఉదయ్ కుమార్ తెలిపారు. మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణానికి చెందిన అహ్మద్ కొంతకాలం నుంచి ఫైనాన్స్ విషయంపై బాధపడుతున్నాడన్నారు. ఉదయం రాయపట్నం గోదావరిలో మృతదేహం కనిపించగా తండ్రి మహమ్మద్ అలీకి అహ్మద్ ఆచూకీ తెలిపామని ఎస్సై వివరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని JGTL ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Similar News

News April 17, 2025

రోడ్డు ప్రమాద నివారణపై కొత్తగూడెం కలెక్టర్ సమీక్ష

image

రోడ్డు ప్రమాదాలు జరగకుండా భద్రత ప్రణాళిక రూపొందించాలని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. బుధవారం జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ఎక్కువ నిడివి గల నేషనల్ హైవేతో పాటు, R&B, పంచాయతీ రహదారులు ఉన్నాయన్నారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలు జరిగే స్థలాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదాలు జరిగినప్పుడు తక్షణ చికిత్స కోసం ప్రణాళిక రూపొందించాలని DMHOను ఆదేశించారు.

News April 17, 2025

ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఉచితం: సూర్యాపేట కలెక్టర్

image

పేదోడి సొంత ఇంటి కలను నెరవేర్చే ఇందిరమ్మ ఇళ్లకు ప్రభుత్వం ఇసుక ఉచితంగా అందజేస్తుందని సూర్యాపేట కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో ఎస్పీ నరసింహతో కలిసి ఇసుక విధానంపై జిల్లా స్థాయి సమావేశం నిర్వహించి మాట్లాడారు. చట్ట విరుద్ధంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, పోలీస్ వారు అక్రమంగా ఇసుక తరలించే వాహనాలు గుర్తించి, సంబంధిత తహశీల్దార్‌కు అప్పగించాలని సూచించారు.

News April 17, 2025

ఏప్రిల్ 17: చరిత్రలో ఈరోజు

image

1756: స్వాతంత్ర్య సమరయోధుడు ధీరన్ చిన్నమలై జననం
1897: ఆధ్యాత్మిక గురువు నిసర్గదత్తా మహరాజ్ జననం
1966: తమిళ హీరో విక్రమ్ జననం
1979: తమిళ హీరో సిద్ధార్ధ్ జననం
1790: US సహవ్యవస్థాపకుడు బెంజమిన్ ఫ్రాంక్లిన్ మరణం
1975: భారత తొలి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్(ఫొటోలో) మరణం
2004: సినీ నటి సౌందర్య మరణం

error: Content is protected !!