News February 8, 2025

ధర్మపురి: బావిలో వ్యక్తి మృతదేహం లభ్యం

image

జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణ శివార్లలో వాగు వద్ద గల బావిలో ఓ వ్యక్తి మృతదేహం శుక్రవారం రాత్రి లభ్యమైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బహిర్భూమి కోసం వచ్చి ప్రమాదవశాత్తు బావిలో పడి ఉంటాడని తెలుపుతున్నారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి ఎస్‌ఐ ఉదయ్ వెళ్లి పరిశీలించారు. మృతుడు జగిత్యాలకు చెందిన ఎండీ హమీద్‌గా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News February 16, 2026

రోజుకు ఒక మూర.. 365 రోజుల శ్రమ

image

భ్రమరాంబ మల్లికార్జున స్వామి క్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారికి ఆలయ విమాన గోపురంపై పాగాలంకరణ ఘనంగా నిర్వహించారు. మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం వైభవంగా జరిగింది. చీరాల వాస్తవ్యులు పృథ్వి సుబ్బారావు 365 రోజుల పాటు నిష్టతో నేసిన పాగాను స్వామికి సమర్పించారు. ప్రతిరోజూ ఒక మూర చొప్పున నేత నేసి సిద్ధం చేసిన ఈ పాగాను భక్తిశ్రద్ధలతో అలంకరించారు.

News February 16, 2026

మేఘా అనుబంధ సంస్థలో చేరిన లక్ష్మీనారాయణ

image

IPS మాజీ అధికారి, CBI మాజీ జేడీ లక్ష్మీనారాయణ మేఘా ఇంజినీరింగ్ అనుబంధ సంస్థ ఈవీ ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో చేరారు. ఈ సంస్థ ఒలెక్ట్రా పేరుతో ఎలక్ట్రిక్ బస్సులను తయారు చేస్తుంది. ఉద్యోగానికి రిజైన్ చేసిన ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించగా పెద్దగా కలిసిరాలేదు. 2019లో జనసేన తరఫున విశాఖ MP అభ్యర్థిగా పోటీ చేసి ఓడారు. ఈ నేపథ్యంలోనే పాలిటిక్స్‌కు స్వస్తి చెప్పి ఉద్యోగంలో చేరినట్లు తెలుస్తోంది.

News February 16, 2026

నిర్మల్: గోదావరి తీరాన.. దీపకాంతుల శోభ

image

లోకేశ్వరం మండలంలోని పంచగుడి, నందిపేట మండలంలోని ఉమ్మెడ గ్రామాల మధ్య గోదావరి తీరాన వెలసిన ఉమామహేశ్వర ఆలయం మహాశివరాత్రి వేళ ఆధ్యాత్మిక కాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోయింది. నిర్మల్, నిజామాబాద్ జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలోని దీపస్తంభం వెలుగుల్లో క్షేత్రం సుందరంగా దర్శనమివ్వగా.. ఆ అద్భుత దృశ్యాలను భక్తులు తమ ఫోన్ కెమెరాల్లో బంధించారు.