News February 28, 2026
ధర్మపురి బ్రహ్మోత్సవాలకు పూర్తి సహకారం: కలెక్టర్

ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు జిల్లా పరిపాలన యంత్రాంగం పూర్తి స్థాయిలో సహకరిస్తుందని తెలిపారు. జిల్లాలో ధర్మపురి క్షేత్రం ఆధ్యాత్మికంగా విశిష్ట స్థానం కలిగి ఉందన్నారు. బ్రహ్మోత్సవాలు శాంతి, సౌభ్రాతృత్వ వాతావరణంలో విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు. భక్తులు సంయమనం పాటిస్తూ స్వామివారిని దర్శించుకుని అనంతరం అన్నప్రసాదం స్వీకరించాలని, వాలంటీర్లు,ఆలయ సిబ్బందికి సహకరించాలని కోరారు.
Similar News
News March 2, 2026
శ్రీనగర్ బంద్.. అప్రమత్తమైన కేంద్రం

ఖమేనీ మృతికి నిరసనగా శ్రీనగర్‌లో షియా వర్గీయులు బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ పరిణామంతో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ముఖ్యంగా లక్నో, శ్రీనగర్ వంటి ప్రాంతాల్లో ఆందోళనలు తీవ్రం కావడంతో.. షియా మత పెద్దల ప్రసంగాలపై నిఘా పెట్టాలని సూచించింది. కశ్మీర్‌లో ఇంటర్నెట్‌పై పాక్షిక ఆంక్షలు విధించింది. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయాలంది.
News March 2, 2026
నెల్లూరు: నర్సింగ్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

బీఎస్సీ నర్సింగ్, బీపీటీ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నెల్లూరు నర్సింగ్ హోమ్ కరస్పాండెంట్ ప్రభుదాసు ఓ ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు NEET-UG పరీక్షకు హాజరై ఉంటే సరిపోతుందన్నారు. మార్చి 8వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలని సూచించారు. సందేహాలు ఉంటే తమ కాలేజీని సంప్రదించాలన్నారు.
News March 2, 2026
చేగుంట మండలంలో వ్యక్తి మృతదేహం లభ్యం

గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం చేగుంట మండలంలో కలకలం రేపింది.. పోలంపల్లి సర్పంచ్ రాజ్యలక్ష్మి తెలిపిన వివరాలు.. గ్రామ శివారులోని రోడ్డు పక్కన ఒక మగ వ్యక్తి మృతి దేహాన్ని గమనించిన స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మృతుడు ఎవరు అనేది తెలియాల్సి ఉంది.


